ఎన్టీఆర్ ‘దమ్ము’...జఫ్పా ‘డ్రమ్ము’
టాలీవుడ్ నవ్వుల డాన్ బహ్మానందం ఫేసు రకరకాల మార్ఫింగులతో నెట్‌లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ పెద్ద హీరో కొత్త సినిమా వచ్చినా...ఆ సినిమా పోస్టర్‌కి బ్రహ్మీ ఫోటోను మార్ఫింగ్ చేసి నెటిజన్లకు వినోదం పంచుతున్నారు బ్రహ్మీ ఫ్యాన్స్. తాజాగా జూ ఎన్టీఆర్ 'దమ్ము' సినిమా ఫోస్టర్ వియషయంలోనూ ఈ తంతు రిపీట్ అయింది.
ఎన్టీఆర్ సిరియస్ ఫేసుకు బ్రహ్మీ కామెడీ ఫేసు తగిలించి....'జఫ్పా డ్రమ్ము' అనే క్యాప్షన్ ఇచ్చి నెట్‌లోకి వదిలారు. ఇప్పుడు ఇది ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నా మిగతా వాళ్లు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.
ఈ ఐడియా తొలుత స్టార్ట్ చేసింది ఎవరో తెలియదుకానీ....బ్రహ్మీపై జరుగుతున్న ఈ హడావుడి నేషనల్ పత్రికల వరకు వెళ్లింది. ఇలాంటి ప్రచారం తనకు మరింత ప్లస్సవుతుండటంతో ఇటు బ్రహ్మానందం కూడా దీనిపై హ్యాపీగానే ఉన్నాడు. అందుకే ఏనాడు కూడా అలాంటివి చేస్తున్న వారిపై ఆయన స్సందించలేదు.
టాలీవుడ్ బడా హీరోలైన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తదితరుల సినిమాలు కూడా త్వరలో విడుదలకు సిద్దం అవుతుండటంతో వాటిపైనా ఇలాంటి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











