అల్లరి నరేష్ మళ్ళీ అదే టైపులో.. సూపర్ హిట్ సినిమా టైటిల్ కామెడీగా!
కామెడీ చిత్రాల రాజుగా దూసుకుపోతున్న అల్లరి నరేష్ కెరీర్ కు వరుస పరాజయాలు బ్రేక్ వేశాయి. అల్లరి నరేష్ ప్రస్తుతం మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో తనకు సుడిగాడు వంటి మంచి విజయాన్ని అందించిన భీమినేని శ్రీవాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్నాడు.
అల్లరి నరేష్ కు పేరడీ చిత్రలు ఎక్కువగా విజయాన్ని అందించాయి. తన చిత్రాల్లో ఒక్క పేరడీ సన్నివేశంతో అయినా అల్లరి నరేష్ హాస్యం పండించేవాడు. తనకు అచొచ్చిన ఆ విధానాన్నే నరేష్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సారి టైటిల్ విషయంలోనే పేరడీ ఫార్ములా అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి 'ఫన్ రాజా ఫన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన రన్ రాజా రన్ చిత్రాన్ని గుర్తు చేసే విధంగా ఉంది. ఈ చిత్ర విజయం అల్లరి నరేష్ అందించే హాస్యాన్ని బట్టే ఉంటుంది. సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











