ఉడుతా ఉడుతా ఊచ్ ఫుల్ కామిడి
బి.జి.వెంచర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఉడతా ఉడతా ఊచ్". ఈ సినిమాలో శ్రీను, విజయభాస్కర్, అక్షయ్ ప్రధాన పాత్రధారులు. మురళీ గణేష్ దర్శకుడు. నిర్మాత తడకల రాజేష్ మాట్లాడుతూ 'మధ్య తరగతి కుర్రాళ్ల మనస్తత్వం డబ్బు విషయంలో ఎలా ఉంటుంది? అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందన్నారు. ఈ చిత్రం డబ్బింగ్ పూర్తి చేసుకుని రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబరులో సినిమాని విడుదల చేస్తాం అన్నారు. మిగిలిన పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, సునీల్, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, కొండవలస, మెల్కొటె, శకుంతల, రజిత తదితరులు నటిస్తున్నారు.
udatha udatha ooch srinu vijay bhaskar akshay murali ganesh thadakala rajesh ఉడతా ఉడతా ఊచ్ శ్రీను విజయభాస్కర్ అక్షయ్ తడకల రాజేష్ మురళీ గణేష్


Click it and Unblock the Notifications