హాస్యనటుడు నగేష్ కన్నుమూత

ఆయన హాస్యనటుడు గానే కాకుండా కమల్ హాసన్ అపూర్వ సహోదరులు వంటి సినిమాల్లో విలన్ కూడా నటించి మెప్పించారు. ఇకమైకల్ మదన్ కామరాజులోనయితే ఆ చేసే నటనకు నవ్వని వారుండరు.అలాగే నమ్మవార్ (తెలుగులో ప్రొఫిసర్ విశ్వం)లో నటనను మర్చిపోవటం కష్టమేనంటారు ఆయన అబిమానులు.ఇక మహా దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో ప్రారంభం రోజుల్లో రజనీకాంత్ ఓ సన్నివేశంలో ఎక్సప్రెషన్స్ ఇవ్వటానికి ఇబ్బందిపడుతూంటే..అప్పుడు ఆయన అదే నగేష్ అయితే ఈ సన్నివేశానికి ఐదు ఎక్సప్రెషన్స్ ఇచ్చి ఏది కావాలో తీసుకోమంటాడు అన్నారు. ఈ విషయాన్ని రజనీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూంటారు. నగేష్ సినిమా కోసమే పుట్టిన వ్యక్తి..వినోదపరచటానికే జీవితాన్ని అంకితం చేసారు అంటారు.
ఇక కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన(సెప్టెంబర్ 27, 1933) ఆయన చిన్నప్పుడే అదృష్టాన్ని వెతుక్కుంటూ చెన్నై వెళ్ళిపోయారి. అక్కడ రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఓ నాటకం చూడటం తటస్ధించింది. అది చూసాక ఆ నటులు కన్నా తను బాగా చేయగలననిపించి..వారిని కలసి తర్వాత షో లో యాక్ట్ చేసారు. అప్పుడు అప్పటి తమిళ సూపర్ స్టార్ యంజిఆర్ గెస్ట్ గా అటెండయ్యారు. నగేష్ అభినయ సామర్ధ్యం చూసి మెచ్చుకుని సినిమా ఆఫర్ ఇప్పించారు. అయితే నాటక రంగాన్ని ఆయన మర్చిపోలేదు. అప్పటి నుంచి దాదాపు వెయ్యి సినిమాల పైదాకా భారతీయ భాషల్లో నటించి తన ప్రితిభా పరిమళాలు అంతటా వెదజల్లారు. హాలీవుడ్ కామిడీ నటుడు జెర్రీలూయిస్ ని అమితంగా ఇష్టపడే ఆయన ప్రారంభం రోజుల్లో అతన్ని అనుకరించేవారు. తర్వాత తనకంటూ స్వంత స్టైల్ ఏర్పాటు చేసుకుని ప్రపంచాన్ని తన కామిడీ పంచ్ లతో గెలిచారు.


Click it and Unblock the Notifications











