భరత్ అనే నేను సినిమాపై కామెంట్స్, ఆ సినిమాను గుర్తు చేస్తోంది!
మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా హిట్ సినిమాగా నిలిచి మంచి వసూళ్ళు రాబడుతోంది. శంకర్ దర్శకత్వం వహించిన ఒకే ఒక్కడు సినిమా, భరత్ అనే నేను సినిమాల్లో కామన్ పాయింట్ హీరో ముఖ్యమంత్రి కావడం. ఇంకో విషయం ఏంటంటే...

ఒకే ఒక్కడు గుర్తు వస్తోంది
దాదాపు 20 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాను ఇప్పుడు గుర్తుకు తెస్తున్నారు కొందరు నెటిజన్లు. అప్పుడెప్పుడో విడుదలై మంచి విజయం సాధించిన సినిమా ఇప్పుడు ఎందుకు చర్చల దశలకు వచ్చిందని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళ్ళితే...

ఆ సినిమాలో కామన్ పాయింట్
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా హిట్ సినిమాగా నిలిచి మంచి వసూళ్ళు రాబడుతోంది. శంకర్ దర్శకత్వం వహించిన ఒకే ఒక్కడు సినిమా, భరత్ అనే నేను సినిమాల్లో కామన్ పాయింట్ హీరో ముఖ్యమంత్రి కావడం. ఇంకో విషయం ఏంటంటే.. ఒకే ఒక్కడులో అర్జున్ మీడియాలో జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చెయ్యడం ఆ సినిమాలో చూసాం.
ప్రేక్షకులు క్లాప్స్ కొడుతున్నారు
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భరత్ అనే నేనులో హీరో మహేష్ ప్రీ క్లైమాక్స్ లో సీఎం అయ్యాక మీడియాపై విమర్శలు చేస్తాడు. అనోవసర వాటిపై మీడియా ఫోకస్ చేస్తుందని కామెంట్స్ చేస్తాడు. సీఎం మీడియా తప్పులు ఎత్తిచూపి డైలాగులు విని ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు.

మీడియాపై మరిన్ని కథనాలు
ఒకప్పుడు మీడియా పవర్ ఫుల్ గా ఉండేది. నిజాలను మాట్లాడేది, కాని ఇప్పుడు ఉన్న మీడియా అలా కాకుండా అవసరం లేని, జానాలు ఎగబడి చూసే వాటిని ఎక్కువ ప్రసారం చెయ్యడంతో సినిమాల్లో మీడియాను తక్కువ చేసి మాట్లాడే డైలాగ్స్ వినిపిస్తున్నాయి. మునుముందు ఈ మీడియాపై మరెంతమంది ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











