పాపం రవితేజ దొరికిపోయాడంటున్నారు
వరస హిట్స్ తో దూసుకుపోతున్న రవితేజకు వీరతో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.అయితే తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా కమిటవటం మరో పెద్ద దెబ్బ అయ్యే అవకాశముందంటున్నారు.స్ట్ర్లైలిష్ గా,కమర్షియల్ గా సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న మెహర్ కి కథ మీద గ్రిప్ లేకపోవటంతో అవి భాక్సాఫీస్ వద్ద బావురుమంటున్నాయి.దాంతో అతనితో సినిమా అంటే హీరోలు ఆమడ దూరం పారిపోతున్నారు.అదే పద్దతిలో రవితేజ కూడా తప్పుకుందామని ట్రై చేసిన కూడా పూరీ జగన్నాధ్ రికమెండేషన్ తో వచ్చిన మెహర్ రమేష్ ని కాదనలేకపోయాడంటున్నారు.
అందులోనూ పూరి తో సినిమాలు చేసినప్పటినుంచీ మెహర్ తో మంచి స్నేహమే ఉంది రవితేజకు.అది దృష్టిలో పెట్టుకుని మెహర్ పాచిక విసిరాడని రవితేజ దెబ్బకు దొరికపోయాడని చెప్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్థ నిర్మించడానికి ముందుకు వచ్చింది.సీమటపాకాయ చిత్రం,ఆ తర్వాత నాన్న డబ్బింగ్ చిత్రం చేసిన ఆ నిర్మాతలు మెహర్ రమేష్ కన్నా రవితేజ డేట్స్ పట్టుకురావటం నచ్చి ఆఫర్ ఇచ్చారంటున్నారు. ప్రస్తుతం మెహర్ స్క్రిప్ట్ వర్క్ మీద బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











