twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎట్టకేలకు పెదవి విప్పిన కమిట్మెంట్ డైరెక్టర్.. అసలు అఫీషియల్ వీడియో కాదు, అయినా క్షమించండి!

    |

    కమిట్మెంట్ అనే మూవీ ట్రైలర్ పెను దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. అన్వేషి జైన్, తేజస్వి మాదివాడ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఆగస్టు 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నాలుగు జంటలు మూతి ముద్దులు పెట్టుకుంటున్న సమయంలో భగవద్గీత శ్లోకం వినిపించడంతో హిందూ సంఘాల వారు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ విషయం మీద దర్శకుడు స్పందిస్తూ క్షమాపణలు కోరారు. ఆ వివరాల్లోకి వెళితే..

     బ్యాగ్రౌండ్ లో

    బ్యాగ్రౌండ్ లో


    తాజాగా కమిట్మెంట్ అంటే సినిమా నుంచి ఒక టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే ఈ టీజర్ హిందూ సంఘాల వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది దానికి కారణం ఈ సినిమా ట్రైలర్ లో నలుగురు జంటలు మూతిమిధులు పెట్టుకుంటున్న సమయంలో వెనుక దీనికి సంబంధించి భగవద్గీత శ్లోకాన్ని బ్యాగ్రౌండ్ లో పెట్టడంతో హిందూ సంఘాల వారికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ గనక డిలీట్ చేయకపోతే ఊరుకోమని ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది హెచ్చరిస్తున్నారు.

     తప్పేమీ లేదని

    తప్పేమీ లేదని


    తాజాగా కరాటే కళ్యాణి కూడా ఈ విషయం మీద కంప్లైంట్ చేశారు అయితే ఇంత వివాదం జరుగుతున్న నేపద్యంలో ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొలత హిందూ సంఘాల వారు వారికి టచ్ లోకి వచ్చి తాము అసలు అధికారికంగా ట్రైలర్ రిలీజ్ చేయలేదని ఇందులో తమ తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే హిందూ సంఘాల వారు వినిపించుకోకుండా ట్రైలర్ డిలీట్ చేయాల్సిందే అంటూ పట్టు పట్టడంతో ఎట్టకేలకు ఈ సినిమా దర్శకుడు లక్ష్మీకాంత్ తెరమీదకు వచ్చారు.

     రిలీజ్ చేయలేదని

    రిలీజ్ చేయలేదని


    తాజాగా నుదుట విభూదితో శ్రీకృష్ణుడి విగ్రహం పక్కన కూర్చుని ఉన్న ఒక వీడియో విడుదల చేసిన లక్ష్మీకాంత్ తాను కూడా హిందువునే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక హిందువుని అయ్యుండి తోటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఈ ట్రైలర్ తాము రిలీజ్ చేయలేదని తాను చెప్పాలనుకున్న సారాంశం భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఉండడంతో దాన్ని సినిమా ట్రైలర్ కు జోడించి తన దగ్గర వారికి పంపాను అని అన్నారు.

     క్షమాపణలు చెబుతున్నా

    క్షమాపణలు చెబుతున్నా


    అయితే వారు బాగా కనెక్ట్ అయిపోయి దానిని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసుకున్నారని దీంతోనే ఈ వివాదం మొదలైందని అన్నారు. అయితే తన ఉద్దేశం ఇలా విడుదల చేయాలని కాదని అయినా హిందూ సోదరులు ఇబ్బంది పడ్డారు కాబట్టి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తన క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

     జరగకుండా చూసుకుంటా

    జరగకుండా చూసుకుంటా


    ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 19వ తేదీన విడుదల కాబోతోంది. నిజానికి సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితమే పూర్తయినా కరోనా కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలు అన్ని విడుదల అయ్యేవరకు ఈ సినిమా హోల్డ్ లో ఉండిపోయింది.

    English summary
    commitment movie director lakshmi kanth chenna says sorry to hindus over trailer controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X