twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేనికైనారెడీ’ పై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

    By Srikanya
    |

    Denikaina Ready
    హైదరాబాద్: 'దేనికైనారెడీ' సినిమా విషయంలో పలు బ్రాహ్మణ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉన్నత అధికారులతో ఓ కమిటీని నియమించింది. ఈ నెల 10 లోగా కమిటీ సభ్యులు సినిమాను పరిశీలించి నివేదికను సమర్పించవలసిందిగా ప్రభుత్వం కోరడమైంది. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, రచయితల సంఘం, కార్మిక సమాఖ్య, చలనచిత్ర వాణిజ్య మండలి సంస్థలకు చెందిన ప్రతినిధులు మీడియా ద్వారా ఓ విజ్ఞాపన చేశారు.

    తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... ''మాకు మా సినిమాలు మనుగడ సాగించాలంటే అన్ని కులాలు, మతాలు, వర్గాలు కావాలి. మేము ఏ ఒక్కర్నీ మనసు బాధపెట్టే విధంగా కావాలని ప్రయత్నించం. ఎక్కడైనా మాకు తెలియకుండా పొరపాట్లు జరిగి ఉంటే మా సంస్థలకు తెలియజేయవలసిందిగా అభ్యంతరం పెట్టేవారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏ సినిమా అయినా సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తర్వాతనే ప్రజల ముందుకు వస్తుంది. అంటే... అది ఒక ప్రభుత్వ డాక్యుమెంట్‌గా జనం ముందుకు వెళుతుందన్నమాట.

    అలాంటి డాక్యుమెంట్‌లో ఏవైనా అనారోగ్యకరమైన అంశాలు ఉండిన పక్షంలో తమ అభ్యంతరాలను సెన్సార్‌వారికి తెలియపరచవచ్చు. అక్కడ కూడా ప్రాంతీయ సెన్సార్ మండలి, రివైజింగ్ కమిటీ, ట్రిబ్యునల్ అనే మూడు దశలున్నాయి. వారు విచక్షణతో మంచి, చెడులను పరిశీలిస్తారు. మరోవైపు ప్రభుత్వ పరిశీలన, ఆజమాయిషీ కూడా ఉంటుంది. ఇంకోవైపున మేము కూడా మా దృష్టికి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించే దిశగా వ్యవహరించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటాం.

    కాబట్టి దయచేసి ఏ ఒక్కరు లేదా సమూహం ఏ వ్యక్తి మీదా దాడి, దూషణ చేయడం కానీ, ఇళ్ల మీదకు రావడం కానీ, కార్యాలయాల ముందు ఎదుర్కోవడం కానీ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ సినిమాకైనా సెన్సార్‌వారిదే ఈ విషయంలో అల్టిమేట్ నిర్ణయం. వారు ఒకసారి సెన్సార్ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సినిమా తీసిన నిర్మాత కూడా ఒక్క దృశ్యం లేదా సన్నివేశం లేదా డైలాగు తొలగించాలంటే సెన్సార్ వారి అనుమతి తప్పనిసరి. కావున ఏది జరిగినా ఆ సంస్థ ద్వారానే జరగడం అనేది అధికారికం. దయచేసి ఇది గమనించవలసిందిగా ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం''అన్నారు.

    English summary
    The state government has appointed a six-member committee to watch the controversial film ‘Denikaina Ready’ and suggest changes. The government has directed the committee to give its report by November 10. Talking to the media, Bharadwaja said they would also appoint a committee to go into the issue. He said film was a popular medium and no one could afford to hurt the sentiments of any caste or community.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X