»   » అంత దమ్ముందా? అంటూ రాజమౌళికి, బాహుబలి టీంకు కౌంటర్!

అంత దమ్ముందా? అంటూ రాజమౌళికి, బాహుబలి టీంకు కౌంటర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి టీం పైరసీకి వ్యతిరేకంగా, పైరసీని అరికట్టాలని కోరుతూ మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పైరసీ చేస్తే వెంటనే తెలిసి పోతుంది, పైరసీకి పాల్పడిన థియేటర్లపై నిషేదం కూడా విధిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేసారు. ఇదే క్రమంలో టిక్కెట్ల రేట్లు ఎక్కువగా ఉండబట్టే పైరసీ జరుగుతుందని కొందరు పాత్రికేయులు వాదించగా....రాజమౌళి వారితో గొడవ పడ్డారు. అల్లు అరవింద్ మధ్యలో కల్పించుకుని గొడవ సద్దుమనిగేలా చేసారు.

మరో వైపు బాహుబలి సోషల్ మీడియా పేజీల్లో ‘సామాన్యుడి కౌంటర్' పేరుతో సామాన్యుల నుండి రాజమౌళికి, బాహుబలి టీంకు కౌంటర్లు వస్తున్నాయి. పైరసీ గురించి మాట్లాడుతున్న మీరు బ్లాక్ టికెటింగ్, థియేటర్లలో కనీస సౌకర్యాలు గురించి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ కౌంటర్ ఇచ్చారు.


బాహుబలి అపీషియల్ సోషల్ మీడియా పేజీల్లో కామెంట్ల రూపంలో పలువురు సామాన్యులు ఈ కౌంటర్లు విసురుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


Common man counter to Baahubali team

-బాహుబలి సినిమా పైరసీ రాకుండా మేము(సామాన్యులం) చూసుకుంటాం!... సినిమా హాళ్లలో బ్లాక్ టికెట్స్ అమ్మ కుండా మేము చూసుకుంటాం అని మీరు మాట ఇవ్వగలరా? అంత దమ్ము, ధైర్యం మీకు ఉందా...
-ప్రేక్షకుల కోసం కనీస వసతులు కల్పించడం గురించి మీరు ఎప్పుడైనా కోర్టు మెట్లు ఎక్కారా.
-సినిమా హాళ్లలోని క్యాంటీన్లలో మితిమీరిన ధరలకు అమ్మే తినుబండారాల విషయంలో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ గడప తొక్కారా...
-సినిమా హాళ్లలో ఉండే కనీస సెక్యూరిటీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా...
-ఈ ప్రశ్నల గురించి మీరు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఆలోచించారా..
-ఈ మహానగరంలో రోజుకు 200 సంపాదించే సామాన్యుడు బాహుబలి సినిమా చూడాలంటే ఎలా?
-కనీసం రూ. 500, రూ. 1000 బ్లాక్ లో అమ్ముతున్నారు. అది కూడా థియేటర్ వాళ్లే. అలాంటి వారిపై మీరు చర్యలు తీసుకోవాలని ఎప్పుడైనా ఆలోచించారా...
-సామాన్యుడు ఇలాంటి సినిమాలను కుటుంబంతో కలిసి చూడాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏసి గదుల్లో కూర్చునే మీరు ఊహించగలరా..
-పైరసీ చెయ్యకుండా చూసే బాధ్యత మీకు ఎంత ఉందో...బ్లాక్ టికెట్స్ అమ్మకుండా చూసే బాధ్యత కూడా అంతే ఉందని మరిచి పోకండి
-నా ప్రశ్నలు(ఈ పచ్చినిజాలు)ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి

English summary
Common man counter to Baahubali team. Movie releasing on July 10th 2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu