ఇద్దరు స్టార్ హీరో మధ్య పోటీయే కదా మజా...!?
నిన్నమొన్నటి వరకు దసరా పండగకి 6 సినిమాలు రిలీజ్ అవుతాయని ఆయా చిత్రాల నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత ఒక్కొక్క సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్ 'దూకుడు", జూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి" మాత్రమే దసరా సీజన్ లో రిలీజ్ కాబోతున్నాయి. దూకుడు సెప్టెంబర్ 23న రిలీజ్ అవుతుండగా, ఊసరవెల్లి అక్టోబర్ 6న పండగరోజు రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలకు రెండు వారాల గ్యాప్ వున్నప్పటికీ సినిమాల మధ్య పోటీ మాత్రం తీవ్రంగానే వుంది. గత సంవత్సరం కూడా దసరా సీజన్ లో ముందు ఖలేజా, తర్వాత బృందావనం రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ తెలిసిందే..
మళ్ళీ అదే రిపీట్ కాబోతోందా అని మహేష్ అభిమానలు ఆందోళన పడుతున్నారు. రిపీట్ కావాలని జూ ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు స్టార్ల మద్య పోటా పోటీ జరిగితేనే కదా మజా అప్పుడే కదా ఏ స్టార్ నెంబర్ వన్ స్థానం దక్కించుకొంటారో తెలిసేది అని విర్రవీగుతున్నారు. అదే ఒక చిన్న హీరోకి, స్టార్ హీరోకి మద్య పోటి జరిగితే ఎలాగూ స్టార్ హీరో సినిమాలే సక్సెస్ అవుతాయని తెలిసే చిన్న, చితక సినిమాలు ఆల్రెడీ డ్రాప్ అయ్యాయి. మరి ఈ దసరాకి అదే రిజల్ట్ వస్తుందో లేక సీన్ రివర్స్ అవుతుందో చూడాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే...


Click it and Unblock the Notifications











