TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పవన్, బాలకృష్ణతో పోటీ మంచిది కాదు, అఖిల్‌లో అదే నచ్చదు...వాళ్ల అమ్మ సపోర్టు: నాగార్జున
అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'హలో'. అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను హలోఅంటూ డిసెంబర్ 22న పలకరించబోతున్నారు అఖిల్ అక్కినేని. సినిమా ప్రచారంలో భాగంగా నాగార్జున, అఖిల్ ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు.
హలో కంటే ముందు వేరే కథ అనుకున్నాం
అఖిల్‌తో సినిమా అనుకున్నపుడు విక్రమ్ మూడు నాలుగు కథలు చెప్పాడు. ‘హలో' కథ కాకుండా అంతకు ముందు మరో కథ అనుకున్నాం. దానిపై ఒక నెల రోజుల పాటు విక్రమ్ చతీ చేశాడు. తర్వాత అతనే వచ్చి ఒక పార్ట్ వచ్చిన తర్వాత స్టోరీ మూవ్ అవ్వడం లేదు అన్నాడు. ఆయన చెప్పిన ‘హలో' స్టోరీ నచ్చేయడంతో సినిమా మొదలైంది అని నాగార్జున తెలిపారు.
డిసెంబర్ మాకు సెంటిమెంట్
డిసెంబర్లో సినిమా విడుదల చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. డిసెంబర్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చే నెల. నాన్నగారి కాలం నుండే మాకు ఈ నెల బాగా కలిసొస్తొంది. అదే విధంగా డిసెంబర్ 22న క్రిస్మస్ సీజన్ మొదలవుతుంది. హాలిడేస్ వస్తాయి. న్యూఇయర్ టైమ్ లో మరో నాలుగు హాలిడేస్ వస్తాయి. అందుకే ఇదే రైట్ టైమ్ అని రిలీజ్ చేస్తున్నాం... అని నాగార్జున తెలిపారు.
నానితో పోటీ అని భావించడం లేదు
‘హలో'తో పాటు దీంతో పాటు నాని ‘ఎంసీఏ' సినిమా కూడా వస్తోంది. సంక్రాంతికి నాలుగు సినిమాలు ఆడుతున్నపుడు ఇపుడు రెండు సినిమాలు వస్తే పెద్దగా సమస్య ఉండుదు. ఇదేదో కాంపిటీషన్ అని కొందరు అంటున్నారు. ఎలాంటి సమస్య ఉండదని నేను అనుకుంటున్నాను అని నాగార్జున తెలిపారు.
పవన్, బాలయ్య లాంటి పెద్ద హీరోలతో పెట్టుకోవడం మంచిది కాదు
సంక్రాంతి పండక్కి పవన్ కళ్యాణ్ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమాతో పాటు మొత్తం నాలుగైదు సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ పెద్ద సినిమాలే. థియేటర్లన్నీ వెళ్లిపోతాయి. అంత పెద్ద స్టార్లతో అఖిల్ పోటీ పడటం ఇపుడు వాడికి అంత మంచింది కాదు అని నా అభిప్రాయం. ‘హలో' సంక్రాంతికి విడుదల కాకపోవడానికి అది కూడా ఓ కారణమే అని నాగార్జున తెలిపారు.
అఖిల్‌లో బాగా నచ్చింది
అఖిల్‌లో స్టంట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. పాటలు పాడుతాడు. మాకు అవి తెలియవు. స్టంట్స్ కోసం మూడు నెలలు శిక్షణ తీసుకున్నాడు. ఏది చేసినా ది బెస్ట్ గా చేస్తాడు. నచ్చనివి అంటే ప్రొద్దున్నే లెగడు. నేను వెళ్లి లేపాలి. వాడికి వాళ్ల అమ్మ సపోర్టు కూడా. నేనేమైనా అంటే 23 ఏళ్ల వయసులో నువ్వు కూడా ఇలాగే చేశావని వెనకేసుకొస్తుంది.... అని నాగార్జున తెలిపారు.
హలో
హలో మూవీ ద్వారా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.