twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యానికి బానిసయ్యేలా..!(మహేష్ బాబు యాడ్‌పై ఫిర్యాదు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రచారం చేస్తున్న రాయల్ స్టాగ్ బ్రాండ్ యాడ్‌పై హెచ్.ఆర్.సి(రాష్ట్ర మానవ హక్కుల సంఘం)కు ఫిర్యాదు అందింది. సెలబ్రిటీలు మద్యం ప్రకటనల్లో నటించడం వల్ల యువతను పెడదోవ పట్టే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. వెంటనే ఆ యాడన్ నిలిపి వేయాలని ఫిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్‌సి జూన్ 5 లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.

    Mahesh Babu Royal Stag ad

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ మధ్య సినిమాల కంటే యాడ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రచారం చేస్తున్న వాటిలో 'రాయల్ స్టాగ్' బ్రాండ్‌ కూడా ఉంది. రాయల్ స్టాగ్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులు ఉన్నప్పటికీ...... ముఖ్యమైన ఉత్పత్తి మాత్రం రాయల్ స్టాగ్ విస్కీ. మత్తు కలిగించి ఆరోగ్యానికి హానికారకమైన విస్కీకి ప్రచారం చేయడానికి పబ్లిక్ ఫిగర్లుగా ఉండే సెలబ్రిటీలు ముందుకు రారు.

    దీంతో అదే పేరుతో ఇతర ఉత్పత్తులు(సోడా, ఇతర ఉత్పత్తులు) తయారు చేస్తూ వాటికి ప్రచారం చేయించడానికి వారిని ఒప్పిస్తుంటారు. తద్వారా విస్కీకి పరోక్షంగా ప్రచారం కల్పిస్తారన్నమాట. ఈ మధ్య చాలా మద్యం కంపెనీలు ఇలాంటి గిమ్మిక్కులే చేస్తున్నాయి. తాజాగా మహేష్ బాబుతో కూడా అలానే చేయిస్తున్నారు. రాయల్ స్టాగ్ మెగా మ్యూజిక్ పేరుతో ఓ ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చి దానికి మహేష్ బాబుతో ప్రచారం చేయిస్తున్నారు. ఈ బ్రాండ్ కు ఇది వరకు చాలా మంది బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లు సైతం ప్రచారం చేసారు. ఇది పరోక్షంగా రాయల్ స్టాగ్ విస్కీకి ప్రచారం చేయడమే అనేది బహిరంగ రహస్యమే. కాదంటారా...?

    English summary
    ocial Workers today approached the Human Rights commission and complained against Mahesh Babu's Ad. They are alleged that Mahesh is encouraging the people to consume the liquor acting in the Ad. The Human Rights commission has asked the state DGP to submit a report within a week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X