»   »  ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి? (ఫోటోస్)

ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ సినిమాల్లోని కొత్త కొత్త కాన్సెప్టులన్నీ క్రమ క్రమంగా బాలీవుడ్లోనూ మొదలవుతున్నాయి. హాలీవుడ్ తరహాలో సెక్స్ కామెడీ చిత్రాల జోరు ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బాగా పెరిగింది. తాజాగా మరో కొత్త కాన్సెప్టు సినిమా ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిపడింది.

అదే... 'త్రీసమ్ లవ్' అనే కాన్సెప్టు. అంటే ముగ్గురు కలిసి ప్రేమించుకోవడం అన్నమాట. ముగ్గురూ ఇష్టప్రకారమే లవ్ చేసుకోవడం. ఇలాంటి కాన్సెప్టుతో తొలిసారిగా బాలీవుడ్లో 'ఇష్క్ జనూన్' అనే సినిమా తీసారు. ఇండియాలో ఇలాంటి కాన్సెప్టు ఇదే తొలిసారి.

'ది హీట్ ఈజ్ ఆన్' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి సంజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ బీర్ సింగ్, దివ్యా సింగ్, అక్షయ్ రంగ్‌షాహి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కతోంది. వినయ్ గుప్తా, అంజు శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సోను నిగమ్, జీత్ గంగూలీ, అంకిత్ తివారీ, అంజన్ భట్టాచార్య సంగీతం అందిస్తున్నారు.

 ఇంకెన్ని బూతు పురాణాలు చూడాల్సి వస్తుందో?

ఇంకెన్ని బూతు పురాణాలు చూడాల్సి వస్తుందో?

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ జోరు చూస్తుంటే హాలీవుడ్ కాన్సెప్టులన్నీ దించేట్టే ఉన్నారు. మున్ముందు ఇంకెన్ని బూతు పురాణాలు చూడాల్సి వస్తుందో?

మరీ ఇంత దిగజారుడా?

మరీ ఇంత దిగజారుడా?

కొత్త కాన్సెప్టు ఓకే కానీ... సినిమాలో అంతా బూతు సీన్లతో నింపేయడం విమర్శలు వస్తున్నాయి. ఆ పోస్టర్లు చూస్తే బాలీవుడ్ సినిమాలా కాకుండా పోర్న్ సినిమాలా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

 అందుకేనేమో?

అందుకేనేమో?

సన్నీ లియోన్ లాంటి ఒకప్పటి పోర్న్ స్టార్లు ఇక్కడ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.... అలాంటపుడు మన సినిమాల్లో పోర్న్ ఛాయలు ఉంటే ఏమిటి? అని భావించారో ఏమో ఫిల్మ్ మేకర్స్ భారతీయులు చూడటానికి కూడా ఇబ్బంది పడేలా పోస్టర్లు డిజైన్ చేసారు.

 కేసు నమోదు

కేసు నమోదు

ఇష్క్ జునూన్ సినిమాపై, పోస్టర్ డిజైనర్స్ పై ముంబైలో పోలీసు కేసు నమోదైంది. చూసేందుకు అసహ్యంగా ఉండే పోస్టర్లను ఉపయోగించి పబ్లిసిటీ చేస్తున్నారని శివసేన పార్టీ వారు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జుహు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.

 పోస్టర్లు తగలబెట్టారు

పోస్టర్లు తగలబెట్టారు

శివసేన కార్యకర్తలు ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు చించేసారు. ఇలాంటి సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు తగలబెట్టారు.

సినిమాకు ట్రైలర్

ఇష్క్ జునూన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇదే...

rn

బూతు పాట

సినిమాలోని పాటల్లో మసాలా బాగా దట్టించారు.

 రిలీజ్ ఎప్పుడంటే..

రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సినిమాను నవంబర్ 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి బాక్సాఫీసు వద్ద ఈ కొత్త కాన్సెప్టుకు... కాదు కాదు ఈ బూతు సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

English summary
Ishq Junoon is billed as Bollywood's first threesome movie and stars actors Divya Singh, Rajbeer Singh and Akshay Rangshahi. Shiv Sainik Jitendra Janwale lodges complaint against hoardings of Ishq Junoon, calls it vulgar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu