twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవమానించారంటూ... మోహన్ బాబు, మంచు విష్ణుపై కేసు పెట్టిన టీచర్!

    By Bojja Kumar
    |

    ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మోహన్ బాబు ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ విద్యానికేత్ విద్యాసంస్థలో పని చేసిన మాజీ టీజర్ మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటు మరో ఐదుగురి మీద కేసు పెట్టారు.

     అవమానించినందుకే ఫిర్యాదు

    అవమానించినందుకే ఫిర్యాదు

    హైదరాబాద్‌కు చెందిన బ్యూలా అనే మహిళ తిరుపతి సమీపంలోని శ్రీ విద్యానికేతన్‌లో 12వ తరగతి ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేసేవారు. నవంబర్‌ 28వ తేదిన జరిగిన ఓ కార్యక్రమానికి బ్యూలా సివిల్‌ డ్రెస్‌లో హజరవ్వడంతో డ్రెస్‌ కోడ్‌ పాటించలేదని ఆమెను అందరిముందు యాజమాన్యం మందలించింది. దీన్ని అవమానంగా భావించిన బ్యూలా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    అప్పుడు జరిగితే ఇప్పుడు ఫిర్యాదు

    అప్పుడు జరిగితే ఇప్పుడు ఫిర్యాదు

    నవంబర్ 28 సంఘటన తర్వాత నుండి బ్యూలా విధులకు హాజరవ్వడం లేదు. మూడు నెలల అనంతరం గురువారం భర్తతో కలసి చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి శ్రీవిద్యానికేతన్‌లో తనకు అవమానం జరిగిందంటూ ఫిర్యాదు చేశారు.

     మోహన్ బాబు, విష్ణుతో పాటు వారిపై కూడా

    మోహన్ బాబు, విష్ణుతో పాటు వారిపై కూడా

    మోహన్‌బాబు, విష్ణుతో పాటు విద్యానికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కైరనే ఎగునే రిజెన్సీ, అసిస్టెంట్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ జీవరాజుగోపాల్‌, సీఏవో తులసి నాయుడు, వైస్‌ ప్రిన్సిపాళ్లు కిన్షుక్‌ భట్టాచార్య, గ్లోరిదెవ్‌ప్రియలపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై సెక్షన్‌ 505, 508 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

     బ్యూలాను తొలగించామన్న తులసినాయుడు

    బ్యూలాను తొలగించామన్న తులసినాయుడు

    బ్యూలా ఫిర్యాదు అనంతం సీఏవో తులసినాయుడు చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు చేరుకు వచ్చి బ్యూలాపై ఫిర్యాదు చేశారు. డ్రెస్ కోడ్ ఉల్లంగించడం వల్ల మందలించామని, విధులకు హాజరు కాకపోవడం వల్ల బ్యూలాను విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. సర్టిఫికెట్లు, రావాల్సిన జీతం డబ్బు తీసుకోవాలని సమాచారం పంపినా ఆమె రాలేని తెలిపారు.

     రూ. 5 లక్షలు కావాలని బెదిరించారు

    రూ. 5 లక్షలు కావాలని బెదిరించారు

    రూ.5 లక్షలు ఇవ్వకుంటే తమను తమను కోర్టుకు ఈడుస్తామని బెదిరిస్తోందని తులసినాయుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై 308, 511రెడ్‌ విత్‌, 34ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    English summary
    A case has been registered against actor and owner of Sri Vidyaniketan group of educational institutions Dr Mohan Babu, CEO and actor Manchu Vishnu and five others in connection with a complaint filed by a former teacher.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X