‘వకీల్ సాబ్’పై రాజకీయాలు: పవన్ సినిమాను ఆపాలని ఎలెక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు.. వాళ్లిచ్చిన తీర్పు ఇదే

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ మేనియా కనిపిస్తోంది. దీనికి కారణం మూడేళ్ల తర్వాత ఆయన 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తుండడమే. దీనికి తగ్గట్లుగానే ఆయన అభిమానులు, జనసేన పార్టీ నాయకులు సైతం భారీ ఏర్పాట్లు చేశారు. ఫలితంగా పల్లెల నుంచి పట్టణాల వరకూ సందడి నెలకొంది. రంగు రంగుల తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'వకీల్ సాబ్' మూవీని ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందడం సంచలనం అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

‘వకీల్ సాబ్’గా రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్

‘వకీల్ సాబ్’గా రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్

చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాళ్ల ముగ్గురిదే సమస్య.. పవన్ పోరాటంతో

వాళ్ల ముగ్గురిదే సమస్య.. పవన్ పోరాటంతో

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఓ కేసులో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లను కాపాడేందుకు లాయర్ అయిన పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. చివరిగా బాధిత యువతులను ఎలా కాపాడాడన్నదే చిత్ర కథ. ఇందులో అంజలి, నివేదా థామస్, అనన్యలు ఆ అమ్మాయిల పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.

అక్కడ షోలు పూర్తి.. అంతటా పాజిటివ్ టాక్

అక్కడ షోలు పూర్తి.. అంతటా పాజిటివ్ టాక్

ఇప్పటికే యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా సహా కొన్ని దేశాల్లో 'వకీల్ సాబ్' ప్రీమియర్ షోలు పడిపోయాయి. అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే రివ్యూలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ఏరియాల్లో స్పెషల్ షోలు కూడా పడినట్లు తెలిసింది. ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

రికార్డులపై కన్నేసిన పవన్.. ఫస్ట్ డే అంచనా

రికార్డులపై కన్నేసిన పవన్.. ఫస్ట్ డే అంచనా

గత ఏడాది సంక్రాంతికి తర్వాత బడా స్టార్ సినిమాలు విడుదల కాలేదు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా భారీ సంఖ్యలో ప్రదర్శన కాబోతుంది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32 -35 కోట్లు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

‘వకీల్ సాబ్’పై రాజకీయం.. సీఈసీకి కంప్లైంట్

‘వకీల్ సాబ్’పై రాజకీయం.. సీఈసీకి కంప్లైంట్

తిరుపతిలో పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోన్న నేపథ్యంలో.. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రాన్ని ఆపేయాలని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన మెరువ నరేంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్ధి పోటీలో ఉన్నారని..పవన్ కళ్యాణ్ ప్రచారం చేసారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Recommended Video

Vakeel Saab Shows Cancelled, Pawan Kalyan’s Fans Angry | Filmibeat telugu
సినిమాకు అనుకూలంగా తీర్పునివ్వడంతో

సినిమాకు అనుకూలంగా తీర్పునివ్వడంతో

'వకీల్ సాబ్' మూవీని నిలిపివేయాలని ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ప్రభుత్వ పరిధిలోని దూరదర్శన్‌ చానెల్‌‌లో తప్ప ఎందులో ప్రసారం అయినా ఎన్నికల నిబంధనల కిందకు రాదని చెప్పింది సీఈసీ. అదే సమయంలో సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఎన్నికల నియామవళి పరిధిలోకి రాదని వెల్లడించింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమాకు అడ్డంకి కలగలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X