పోసానిపై వైఎస్ 'తుపాకీ'?

ఈ సినిమాలో పోసాని వైఎస్ గెటప్ లో నటించారు. వైఎస్ పై ఎన్నో సెటైర్లు పడ్డాయని సమాచారం. ఇటీవల టీవీ 9 ఇంటర్వ్యూలో పోసాని తనదైన ఆవేశంతో ఈ సినిమాపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తాను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ సినిమా తీయలేదని చెప్పుకొచ్చారు. ఈ సినిమాపై విమర్శల్లో నిజం ఉంటే తాను టీవీ కెమెరాల ముందు చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీస్తానని, అబద్ధమైతే టీవీ 9 జర్నలిస్టులు గుంజిళ్ళు తీయాలని ఆయన సవాలు విసిరారు. అయినా ఎన్నికల్లోపు ఆ సినిమా విడుదల కాకపోతే, అందుకు ఎన్నికల సంఘం అడ్డుకుంటే ఏం అనుకున్నా ఏమవుతుంది?


Click it and Unblock the Notifications











