చిరు ఒత్తిడి, అందుకే నో కేస్ : రామ్ చరణ్‌‌పై హెచ్ఆర్‌సి‌లో ఫిర్యాదు

By Bojja Kumar

హైదరాబాద్ : సినీ నటుడు రామ్ చరణ్‌పై రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల బంజారాహిల్స్‌లో ఇద్దరు వ్యక్తులపై రామ్ చరణ్ బాడీగార్డులు దాడి చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఆదేశాల మేరకే వారు ఆ చర్యకు పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలో సలీం అనే న్యాయవాది హెచ్‌ఆర్‌సి‌ని ఆశ్రయించి రామ్ చరణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి సంఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయాలని, బాధితులు ఫిర్యాదు చేయలేదనే కారణంగా కేసు పెట్టక పోవడం వెనక కేంద్ర మంత్రి చిరంజీవి ఒత్తిడి ఉందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా దాడి కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు.

న్యాయవాది పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హెచ్ఆర్‌సి ఈ వ్యవహారంపై జూన్ 18లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌ను ఆదేశించింది. కేవలం తన కారుకు సైడ్ ఇవ్వలేదనే చిన్న కారణంతో పట్టపగలు నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు చరణ్. వారిని దుర్భాషలాడటంతో పాటు తన మనుషులను రప్పించి వారిని కొట్టించాడు.

పట్టపగలు నడి రోడ్డుపై ఇంత దౌర్జన్యకాండ జరిగినా...ఈ దాడికి ఉసిగొల్పిన రామ్ చరణ్‌పై గానీ, అతని బాడీగార్డులపై గానీ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇదే విషయం పోలీసులను అడిగితే బాధితులు ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదని సమాధానం ఇస్తున్నారు.

తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన బాధితులు కళ్యాణ్, ఫనీష్‌లు ఎదుటి వర్గం బెదింపులకు బెదిరిపోయారో? కేంద్ర మంత్రిగారి కొడుకు, పైగా పెద్ద హరోతో పెట్టుకోవడం ఎందుకు అనవసర తలనొప్పి అనుకున్నారో? లేక ఇంకేరకంగానైనా రాజీ కుదుర్చుకున్నారో? తెలియదు కానీ వారు ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగారు. ఈ వ్యవహారంలో రామ్ చరణ్‌పై కేసు నమోదు కాకుండా పోలీసులు శక్తిమేర ప్రయత్నించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X