twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కడప’ ఎఫెక్ట్: రామ్ గోపాల్ వర్మ అరెస్టు దిశగా ప్రయత్నాలు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ఆర్జీవీ ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్ !

    రామ్ గోపాల్ వర్మ అంటే... సినిమాల కంటే కూడా వివాదాలే ఎక్కువ గుర్తుకొస్తాయి. తరచూ ఏదో ఒక వివాదంలో ఉండే ఈ స్టార్ డైరెక్టర్ తన తాజా వెబ్ సిరీస్ 'కడప' ద్వారా రాయలసీమ ప్రజలు రగిలిపోయేలా చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందే అంటూ ఆగ్రహంగా ఉన్న అక్కడి వారు... ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

    సీమను దారుణంగా చూపెట్టిన వర్మ

    సీమను దారుణంగా చూపెట్టిన వర్మ

    రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షనిజం ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ ప్రాంతంలో ఇపుడు ఫ్యాక్షనిజం తగ్గుముఖం పట్టింది. ఒకప్పటి లాంటి దారుణమైన పరిస్థితులు మాత్రం లేవు. అయితే ప్రజలు ఆ చీకటి అధ్యాయం గురించి గురించి మరిచిపోతున్న తరుణంలో.... వర్మ ‘కడప' పేరుతో వెబ్ సిరీస్ తేవడం, అందులో పలు దారుణమైన సన్నివేశాలు చూపించడంతో అంతా షాకయ్యారు.

    అక్కడ అడ్డుకుంటారని ఈ దారిలో

    అక్కడ అడ్డుకుంటారని ఈ దారిలో

    తాను అనుకున్నది వెండి తెర‌పైన చూపించ‌డానికి సెన్సార్ బోర్డు అడ్డు వ‌స్తుంద‌ని భావించిన వ‌ర్మ..... ఎవరూ ఆపడానికి వీల్లేని డిజిట‌ల్ మీడియాని ఎంచుకున్నాడు. ‘కడప' వెబ్ సిరీస్‌లో ఇందులో బోల్డ్ కంటెంట్‌తో పాటు ఫ్యాక్ష‌నిజం, బూతు ప‌దాలు కూడా వాడటం గమనార్హం.

    వర్మను అరెస్టు చేయాల్సిందే

    వర్మను అరెస్టు చేయాల్సిందే

    ప్రశాంతగా ఉన్న రాయలసీమను ఫ్యాక్షన్ అడ్డాగా చూపిస్తూ సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, రామ్ గోపాల్ వర్మ వెంటనే అరెస్ట్ చేయాలని రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

    పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

    పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

    అనంత‌పురం త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఈ మేరకు రాయలసీమ విమోచన సమితి నాయకులు ఫిర్యాదు చేశారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయకపోతే కోర్టులో పిల్ దాఖలు చేయడానికైనా సిద్ధమే అన్నారు. మరి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో? చూడాలి.

    English summary
    Controversial director Ram Gopal Verma once again got involved into another controversy with his web video series titled 'Kadapa' on the Rayalaseema Reddies. Rayalaseema leaders demand arrest of RGV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X