twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర్టు చిక్కుల్లో వర్మ ‘రామాయణం’

    By Bojja Kumar
    |

    తన స్టయిల్ లో రామాయణం తీస్తా, నా రామయణం త్రేతాయుగం నాటిది కాదంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు బాలయ్య నటించిన 'శ్రీరామ రాజ్యం" సినిమా హిట్ టాక్ తో దూసుకెలుతున్న నేపథ్యంలో టింగరి వేషాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందంతా ఒక ఎత్తయితే ఈ సినిమాలో ప్రముఖ హీరో నాగార్జునతో విలన్ రావణ్ రాజు పాత్ర వేయిస్తానంటూ మరో సంచలనానికి తెరలేపాడు వర్మ. ఈ విధంగా తాజాగా ఫిల్మ్ నగర్ లో వర్మ హాట్ టాపిక్ అయ్యారు.

    కాగా....వర్మ తీయబోతున్న రామయణంపై వరంగల్ జిల్లాకు చెందిన న్యాయవాది కోర్టుకెళ్లారు. ఆయన కోర్టుకెళ్లడానికి కారణం 'రామయణం" అనే టైటిలే. వర్మ చెప్పిన ఈ చిత్రం కథ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, అలాంటి కథనకు హిందువులు పవిత్రంగా భావించే 'రామయణం" పేరు పెట్టడం సరికాదని, వెంటనే టైటిల్ మార్చాలంటూ సత్యప్రకాష్ అనే న్యాయవాది హైకోర్టు రిజిస్ట్రార్ కు పిర్యాదు చేశారు. వర్మకు కూడా లీగల్ నోటీసులు పంపారు. రామయణం పేరు మీద సినిమా నిర్మించడానికి వర్మకు అనుమతి ఇవ్వ వద్దని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    English summary
    Lawyer Sathya Prakash Complaint against RGV's Ramayana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X