twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌గోపాల్ వర్మ మెడకు గట్టిగానే చుట్టుకున్న సన్నీలియోన్ కేసు

    మహిళా దినోత్సవం నాడు మహిళలకు శుభాకాంక్షలంటూనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు ఇప్పుడు పోలీస్ కేసుల దాకా వెళ్ళాయి.

    |

    వర్మ తాజాగా చేసిన ట్విట్ వివాదం రేకెత్తించేలా ఉంది. మహిళా దినోత్సవం నాడు మహిళలకు శుభాకాంక్షలంటూనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు చేశాడు. వుమెన్స్ డే రోజున ప్రపంచంలోని మహిళలంతా సన్నీ లియోన్ లా సంతోషం పంచాలని కోరాడు. ఆ రోజున పురుషులంతా ఏం చేస్తారో తనకు తెలియదని, అయితే ఏడాదిలో ఒకరోజును మెన్స్ వుమెన్స్ డే పాటించాలని అన్నాడు. మగవారందరి తరఫున మహిళలకు ఎ వెరీ హ్యాపీ వుమెన్స్ డే చెబుతున్నానని వర్మ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

    Complaint Filed Against RGV Over His Sunny Leone Tweet On Women's Day

    ఇలాంటి వివాదాలు వర్మకు కొత్తేం కాదు. కానీ.. గతంతో పోలిస్తే.. తాజా వ్యాఖ్యలు ఘాటుగా ఉండటం.. తప్పుపట్టేలా ఉండటం గమనార్హం. వర్మ చేసిన అనుచిత ట్వీట్ పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. మహిళల్నికించపరిచేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సన్ని పేరుతో వర్మ చేసిన వ్యాఖ్యలపై సామాజిక ఉద్యమకర్త విశాఖ మాంబ్రే గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Complaint Filed Against RGV Over His Sunny Leone Tweet On Women's Day

    దీనిపై గోవాలో విశాఖ మాంభ్రే అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ ట్విట్టర్ ఎకౌంట్‌ను శాశ్వతంగా బ్లాక్ చేయాలని పోలీసులను కోరారు. దీంతో మాంబ్రె పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వర్మ ఈ ట్వీట్ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. సన్నీలియోన్‌ నిజాయతీ పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తపరచాన్నాడు వర్మ. నిజంగా మిగతా మహిళాలు కంటే సన్నీలియోన్ ఎంతో నిజాయితీగా ఉటుందని, తన వ్యాఖ్యలు అర్ధం కాని మూర్ఖులే ఇలా విమర్శలు చేస్తారని ఫైర్ అయ్యాడు వర్మ.

    English summary
    After Ram Gopal Varma's Sunny Leone tweet on Women's Day, a police complaint was filed against the filmmaker. He has now threatened to file a counter complaint.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X