twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుచిత్రను అరెస్ట్ చేయండి.. లీక్స్‌లో బిగుస్తున్న ఉచ్చు

    By Rajababu
    |

    గాయని సుచిత్ర లీకుల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. గాయని వెల్లడిస్తున్న వివరాలు ఆసక్తిని కలిగిస్తునే మరోవైపు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా నేషనల్ లీగ్ పార్టీ ఆమె ఫిర్యాదు చేసింది. సుచిత్రను వెంటనే అరెస్ట్ చేయాలని చెన్నై సిటీ పోలీసులను ఆ పార్టీ ప్రతినిధులు కోరారు. సుచిత్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    సుచిత్ర అకౌంట్ నాలుగువారాల క్రితం హ్యాక్

    సుచిత్ర అకౌంట్ నాలుగువారాల క్రితం హ్యాక్

    ‘సుచిత్రా ట్విట్టర్ అకౌంట్ నాలుగు వారాల క్రితం హ్యాక్ అయింది. ఆ సమయంలో తన అకౌంట్‌లో లాగిన్ కాలేదు. ఆమె అకౌంట్‌లో అభ్యంతరకరంగా సినీ తారల చిత్రాలు అప్‌లోడ్ అయ్యాయని తన స్నేహితురాలు చెప్పడంతో లాగిన్ అయింది. ఆ తర్వాత తన అకౌంట్‌ను సస్పెండ్ చేయడం కోసం లాగిన్ అయిన సమయంలో అప్పటికే బటన్ డీ యాక్టివేట్ అయింది' అని సుచిత్ర లాయర్ గణేశ్ ఖన్నా మీడియాకు తెలిపారు.

    50కి పైగా ఫేక్ అకౌంట్స్

    50కి పైగా ఫేక్ అకౌంట్స్

    తన అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న కొద్ది గంటల్లోనే వెంటనే సుచిత్ర లీక్స్ పేరిట 50కి పైగా ఫేక్ అకౌంట్లు పుట్టుకొచ్చాయి. నకిలీ అకౌంట్లలో కుప్పలు తెప్పలుగా సినీ తారల శృంగార ఫోటోలు, వీడియోలు పోస్ట్ అవ్వడం తలనొప్పిగా మారుతున్నది. అంతేకాకుండా తమిళ చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలకు ఈ లీక్స్ వ్యవహారం తాకింది.

    తమిళ నిర్మాతల ఎన్నికల్లో కలకలం

    తమిళ నిర్మాతల ఎన్నికల్లో కలకలం

    కాగా తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) కు ఎన్నికల జరుగుతున్న సమయంలోనే సుచిత్ర లీక్ రావడం పరిశ్రమ వర్గాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడనున్నదనే ఆందోళనలో సినీ వర్గాలు ఉన్నాయి.

    రిటైర్డ్ జడ్జీ పర్యవేక్షణల్లో ఎన్నికలు

    రిటైర్డ్ జడ్జీ పర్యవేక్షణల్లో ఎన్నికలు

    ఈ ఎన్నికలు హైకోర్టు ఆదేశాల మేరకు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో జరుగనున్నాయి. గతంలో ఏడుగురు తమిళనాడు సీఎంలు టీఎఫ్పీసీలో కీలక పాత్ర పోషించారు. రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర నిర్మాత కలైపులి థాను ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు.

    పోటీలో విశాల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్

    పోటీలో విశాల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్

    ఏప్రిల్ 2న జరిగే ఈ ఎన్నికల్లో విశాల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్, మైస్కిన్, ప్రముఖ దర్శకుడు, హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, కేఈ జ్ఝానవేల్, ఎస్ఆర్ ప్రభు, ఏఎం రత్నం, రాధాకృష్ణన్, ఏల్ అజగప్పన్ తదితరులు పోటీ పడుతున్నారు.

    English summary
    Complaint filed against Suchitra by India National Leauge Party. They urged the Chennai city police to arrest her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X