Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సెక్స్ చిత్రాల హీరోయిన్‌పై కేంద్రానికి ఫిర్యాదు
పెద్దలు మాత్రమే చూడాల్సిన అడల్ట్ సెక్స్ చిత్రాల్లో నటించే సన్ని లియోన్ బిగ్ బాస్ షో ద్వారా భారతీయ బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈవిడ రాకతో భారతీయ కుటుంబాల్లోని మైనారిటీ తీరని పిల్లలు చెడ్డదారిలో ప్రయాణిస్తున్నారు. సన్నీలియోన్ విదేశాల్లో ఫోర్న్ చిత్రాల్లో నటించే నటి అని తెలియడంతో....బిగ్ బాస్ షో చూసే మైనారిటీ తీరని పిల్లలు....ఇంటర్నెట్ లో ఆమె నటించిన సెక్స్ చిత్రాలు చూడటానికి ఎగబడుతున్నారు. పిల్లల్లో అలవడుతున్న ఈ ధోరణి గమనించిన తల్లిదండ్రలు లబోదిబో మనక తప్పడం లేదు.
ఈ నేపథ్యంలో ఇండియన్ యాక్టర్ అండ్ ఆర్టిస్ట్ ఫోరం(IAAF) సన్నీలియోన్ తో బిగ్ బాష్ షో ప్రసారం చేస్తున్న కలర్స్ ఛానల్ పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఫోర్న్ తారలతో కూడిన ఈ షోను ప్రసారం చేస్తున్న కలర్స్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి అంబికా సోనికి ఫిర్యాదు చేశారు. ఈ ముదనష్టపు హీరోయిన్ మూలంగా ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో? ఏమో అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.