ఉదయ్ కిరణ్ చిత్రంపై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్
శ్వేతా బసు, ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో రెడీ అవుతన్న నువ్వుక్కెడుంటే నేనక్కడుంటా చిత్రం సమస్యల్లో పడింది. అసలే ఈ చిత్రం ప్రారంభం అయి చాలా కాలం అయినా రకరకాల సమస్యలతో నత్త నడక నడుస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్ శ్వేతబసు కొద్ది కాలం ట్విస్ట్ ఇస్తే..ఉదయ్ కిరణ్ కి మార్కెట్ లేక ఫైనాన్స్ ఇబ్బందులై కొన్ని సమస్యలు వచ్చాయి. అయనా తట్టుకుని ముందుకెళ్ధామంటే తాజాగా రామ్ అనే రచయిత ఒకరు నిన్న(సోమవారం) ఈ చిత్రం కథ నాదేనని ఫిల్మ్ ఛాంబర్ లో పిర్యాదు నమోదు చేసారు. ఆ విషయం తేలేదాకా ఈ చిత్రం రిలీజ్ చేయటానికి ఉండదు. అసలే రీసెంట్ గా ఉదయ్ కిరణ్, మీరా జాస్మిన్ కాంబినేషన్లో వచ్చిన అల్లాడిస్తా చిత్రం డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని ధియోటర్స్ ని రెండో రోజుకే దాటిపోయింది. మరో ప్రక్క కళావర్ కింగ్ సైతం పోవటంతో శ్వేతాబసుకు అస్సలు మార్కెట్ లేదు. ఈ గొడవ సరిపోదా అన్నట్లు గోరుచుట్టుపై రోకలిపోటులా ఈ రైటర్ కాపీ వ్యవహారం వచ్చిందంటున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు సుభా శెల్వం.


Click it and Unblock the Notifications











