వివాదంలో లారెన్స్ 'కాంచన'
లారెన్స్, లక్ష్మీరాయ్ కాంబినేషన్ లో రూపొందిన హర్రర్ 'కాంచన'చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది.అయితే ఈ సినిమాలో ఆరె కటిక ల మనోభావాలను దెబ్బతీసే పాటను తక్షణం తొలగించాలని, బాధ్యులైన నిర్మాత లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరె కటిక పోరాట సమితి సోమవారం డిమాండ్ చేసింది. దీనిపై స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయించడంతోపాటు సెన్సార్ కార్యాల యం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్‌కూ ఫిర్యాదు చేశామని సమితి అధ్యక్షుడు గోరికార సుధాకర్‌కటి తెలిపారు.ఇక ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకున్నా అవి ప్రారంభ వసూళ్ళుగా మారి సోమవారం నుంచి కలెక్షన్స్ డల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











