మగధీర పై పోరాటం
ఇటీవల విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మగధీర చిత్రంపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు నమోదయింది. తన కథని వాడుకునే మగధీర చిత్రాన్ని తీసారని యస్.పి.చారి ఆరోపించడం తెలిసిందే. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ వైపు నుండీ కానీ, దర్శకుడు యస్.యస్.రాజమౌళి నుండీ కానీ ఎలాంటి వివరణ రాకపోయేసరికీ తానీ నిర్ణయం తీసుకున్నట్టు యస్.పి.చారి తెలిపారు.
1998వ సంవత్సరంలో చందేరీ అనే నవల 4౦౦ ఏళ్ళక్రిందటి ప్రేమకథ కాప్షన్ తో ప్రతి వారం ఆంధ్రభూమి వీక్లీలో సీరియల్ గా వచ్చేది. అదే కాప్షన్నిమగధీరలోకూడా వాడుతున్నారని, పునర్జన్మలో పునస్సమాఘం కాన్సెప్ట్ తాను సృష్టించినదే అనీ, హీరోనే కథలో హీరోయిన్ని ఈ జన్మలో కనుగొంటాడనీ...ఇలా తన కథని ఎలాంటి అనుమతి లేకుండా వాడుకున్నారనేది యస్.పి.చారి గారి ఫిర్యాదు సారాంశం.
More from Filmibeat
magadheera ram charan kajal allu aravind ss rajamouli andhra bhoomi spchari మగధీర రామ్ చరణ్ కాజలా అల్లు అరవింద్ యస్యస్రాజమౌళి ఆంధ్రభూమి యస్పిచారి


Click it and Unblock the Notifications











