twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా 'అల్లుడి' సినిమా.. మెహ్రీన్‌పై నిర్మాత ఫిర్యాదు, ఏం జరిగిందంటే!

    |

    మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండవ సినిమా విషయంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం విజయం సాధించకపోయినా కళ్యాణ్ దేవ్ పెర్ఫామెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం తరువాత నటనలో పరిణితి కోసం కళ్యాణ్ దేవ్ శిక్షణ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

    సంచలన బ్యూటీ కోసం

    సంచలన బ్యూటీ కోసం

    కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు పులి వాసు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ మొదటగా కన్నుగీటి సంచలనం రేపిన ప్రియా వారియర్ ని సంప్రదించారట. కానీ ప్రియ వారియర్ మెగా అల్లుడి చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ చిత్రంతో కళ్యాణ్ దేవ్ కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

    మెహ్రీన్ కోసం ప్రయత్నాలు

    మెహ్రీన్ కోసం ప్రయత్నాలు

    ప్రియా వారియర్ ఈ చిత్రానికి నో చెప్పడంతో నిర్మాతలు మరో హీరోయిన్ ప్రియ వారియర్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. మెహ్రీన్ కూడా ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. కానీ నిర్మాతలకు, మెహ్రీన్ కు మధ్య సమస్య తలెత్తడంతో.. ఈ వివాదం ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి కారణం గతంలో మెహ్రీన్ నిర్మాతలతో కుదుర్చుకున్న ఒప్పందమే.

    సుదీర్ బాబు చేయాల్సిన చిత్రం

    సుదీర్ బాబు చేయాల్సిన చిత్రం

    ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ చేయబోతున్న చిత్రాన్ని నిర్మాతలు ముందుగా సుదీర్ బాబుతో అనుకున్నారు. ఈ చిత్రం కోసం మెహ్రీన్ కు అడ్వాన్స్ ఇచ్చి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అంతా సిద్దం అయ్యాక సుధీర్ బాబు ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి కళ్యాణ్ దేవ్ వచ్చాడు. కాంబినేషన్ మారడంతో ఈ చిత్రంలో నటించడం ఆసక్తి లేదని మెహ్రీన్ నిర్మాతలకు చెప్పేసిందట. పైగా అడ్వాన్స్ కుడా తిరిగి ఇవ్వకపోవడంతో నిర్మాత ఫిలిం చాంబర్ ని ఆశ్రయించారు.

    త్వరలోనే ప్రారంభం

    త్వరలోనే ప్రారంభం

    ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నారు. తొలి చిత్రం నిరుత్సాహ పరచడంతో ఈ చిత్రంలో రెట్టించిన ఉత్సాహంతో నటించాలని కళ్యాణ్ దేవ్ ఉవ్విళ్ళూరుతున్నాడు.

    English summary
    Complaint on Mehreen over Megastar Son in law Kalyaan Dhev movie. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X