మోసం చేస్తున్నాడంటూ...కమిడియన్ సోదరునిపై ఫిర్యాదు
బెంగళూరు : కన్నడ చిత్ర హాస్య నటుడు, సంగీత దర్శకుడు సాధుకోకిల సోదరుడు లయ కోకిల అలియాస్ లయేంద్ర తమను వంచించాడంటూ చలన చిత్ర వాణిజ్య మండలికి నిర్మాత కుమార్ ఫిర్యాదు చేశారు. కన్నడ ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదే టాపిక్ గత రెండు రోజులుగా నడుస్తోంది.
తాను నిర్మిస్తున్న శంభో మహదేవ చిత్రం రీరికార్డింగ్, డిజిటలైజేషన్ పనులకు తమ నుంచి రూ.4 లక్షల నగదును తీసుకుని పని పూర్తి చేయకుండా, నగదు చెల్లించకుండా వంచిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లయేంద్ర తప్పించుకు తిరగటంతో తమ చిత్రాన్ని విడుదల చేసేందుకు సాధ్యం కావటం లేదని ఆయన ఆక్రోశించారు.

నిర్మాతల మండలి కార్యదర్శి భామా గిరీష్ నేతృత్వంలో సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించగా లయేంద్ర అందుబాటులో లేరని గుర్తించారు. మండలి కార్యాలయానికి రావాలని మండలి ప్రతినిధులు లయేంద్రకు ఫోన్‌లో సూచించారు.


Click it and Unblock the Notifications











