twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతు మూవీ..! ‘సారీ టీచర్’పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'సారీ టీచర్‌' తెలుగు సినిమాను తక్షణమే నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యుటిఎఫ్‌) ప్రతినిధి బృందం, ఐద్వా ప్రతినిధులు మగళవారం హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న 'ఐ లవ్‌ యూ టీచర్‌' సినిమా షూటింగ్‌ను నిలుపుదల చేయాల్సిందిగా కోరుతూ యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రాతినిధ్యం చేశామని గుర్తు చేశారు. అదే సినిమాను ఇప్పుడు పేరు మార్చి 'సారీ టీచర్‌'గా విడుదల చేయనున్నారని తెలిపారు.

    ఉపాధ్యాయ, విద్యార్థి సంబంధాలను దెబ్బతీసే ఈ సినిమాను తక్షణమే నిలిపేయాలని సెన్సార్‌ హెచ్ఆర్సీ చైర్మన్‌కు యుటిఎఫ్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఇచ్చిన యు/ఎ సర్టిఫికెట్‌ను ఉపసంహరించుకోవాలని లేదా సినిమా విడుదలకు ముందే ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేసి ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులను, న్యాయమూర్తులను, మానవ హక్కుల కమిషన్‌ వారిని, బాలల సంఘాల వారిని ఆహ్వానించాల్సిందిగా డిమాండ్‌ చేసారు.

    మహిళల వ్యక్తిత్వాన్ని దిగజార్చే, గురువులను అగౌరవ పరిచే పద్ధతుల్లో ఉన్న 'సారీ టీచర్‌' సినిమాను వెంటనే నిలిపివేయాలని, అశ్లీల పోస్టర్లను తక్షణం తొలగించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

    ఆర్యమన్, కావ్యాసింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సారీ టీచర్'. సూర్యలోక్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆనంద్ నిర్మిస్తున్నారు. శ్రీసత్య దర్శకుడు. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాలు వేరు, బూతు సినిమాలు వేరు. ఇప్పుడు నిర్మాణ ఖరీదు బాగా పెరగడంతో బూతు సినిమాలు తగ్గాయి. అయితే, కొందరు అలాంటి బూతు కథాంశంతో మెయిన్ స్ట్రీమ్ సినిమాలను నిర్మిస్తున్నారు. అలాంటి కోవలోకి వచ్చేదే "సారీ టీచర్" సినిమా.

    English summary
    Andhra Pradesh United Teacher's Federation and All India Democratic Women's Association lodged a 'Sorry Teacher' movie against 'Sorry Teacher' movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X