twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ సెక్సీ బేబీ దీపిక పడుకొనె వరుస అవకాశాలతో బాగానే సంపాదిస్తోంది. దీంతో కోట్లు ఖర్చు పెట్టి ముంబై ప్రభాదేవి ప్రాంతంలో ఇటీవలే ఓ కాస్టీ ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఫ్లాటు కొన్న సందర్భంగా బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులకు, తన సన్నిహితులకు శనివారం రాత్రి పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా హోరెత్తించే సంగీతం, మందు, విందు ఏర్పాట్లు చేసిందట దీపిక. అంతా బాగానే గానీ ఈ పార్టీలో ఏర్పాటు చేసిన లౌడ్ మ్యూజిక్ చుట్టుపక్కల వారిని తెగ ఇబ్బంది పెట్టేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి చేరుకున్న పోలీసులు..కాస్త హడావుడి చేసినట్లు చేసిన...ఎలాంటి చర్యలు తీసుకోకుండానే అక్కడి నుంచి నిష్కృమించారు.

    పోలీసులు వెళ్లి పోయిన కొద్ది సేపటికి దీపిక ప్లాటు నుంచి పలువురు సెలబ్రెటీలు బయటకు వచ్చి హడావుడిగా, కనీసం మీడియాతో మాటైనా మాట్లాడకుండా అక్కడి నుంచి తుర్రుమన్నారు. లిక్కరకింగ్ విజయ్ మాల్యాతో పాటు, ఇమ్మాన్ ఖాన్ అతని భార్య అవంతిక, నటులు అభయ్ డియోల్, ప్రీతి దేశాయ్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, ప్రియాంక చోప్రా, సిద్ధార్థ మాల్య, షాహిద్ కపూర్, అనుష్క శర్మ, రితేష్ దేశ్ ముఖ్, రణవీర్ సింగ్, జనీలియా తదితరులు వీరిలో ఉన్నారు.

    దీపిక ప్లాటును పోలీసులు చుట్టుముట్టిన ఘటనపై దాదార్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ...తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఎక్కువ మంది గుమిగూడారనే సమాచారం రావడంతో అక్కడికి వెళ్లామని, అదేమీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కాదని వెల్లడించారు.

    English summary
    Bollywood actress Deepika Padukone's house-warming party ended abruptly early on Saturday after the police landed up at her brand new pad at Prabhadevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X