»   » బాలికపై రేప్ : బండ్ల గణేష్‌పై హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు

బాలికపై రేప్ : బండ్ల గణేష్‌పై హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bandla Ganesh
హైదరాబాద్ : తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు. షాద్ నగర్లో బండ్ల గణేష్‌కు చెందిన పౌల్ట్రీ ఫాంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసారు.

ఆ పౌల్ట్రీలో పని చేసే 40 ఏళ్ల వ్యక్తి అదే పౌల్ట్రీలో పనిచేస్తున్న 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 9 ఏళ్ల బాలికను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం అయిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం - మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం తిమ్మాజిపల్లి తండా సమీపంలోని పరమేశ్వర పౌల్ట్లీలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. వీరు మూడు రోజుల క్రితం పని మీద సొంత ఊరికి వెళ్లారు. వారి చిన్న కూతురు ఇక్కడే ఉంది.

ఆ బాలిక ఈ నెల 9వ తేదీన పౌల్ట్లీలో గుడ్లు తీస్తుండగా అక్కడే పనిచేసే ఉద్యోగి శ్రీను ఆ బాలికను మరో షెడ్లో గుడ్లు తీయాలని తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A Non-profit organizations activists complaints against Bandla Ganesh in HRC. A 9 year old girl has been sexual assualted by a 40 years old person at film producer Bandla Ganesh's poultry in Mahaboobnagar district.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu