మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రామ జోగయ్యపై.... పవన్ కళ్యాణ్ ట్వీట్!
జనసేన పార్టీ 'కవాతు' పాటకు సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రికి, సంగీత దర్శకుడు తమన్‌కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. రామజోగయ్య రాసిన 'పద పద పద పద మెరుపులా పద.. ఆ గగనం భువనం అదిరే మెరుపులా పద..' అంటూ అని సాగే ఈ పాటకు తమన్ బాణీలు అందించారు.
పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ పేజీ ద్వారా ఈ ఇద్దరికీ థాంక్స్ చెప్పడంతో పాటు... పాట రికార్డింగ్ రూమ్‌లో తీసిన వీడియోను కూడా షేర్ చేశారు.
ప్రియమైన రామ జోగయ్య గారికి, విపరీతమైన పని ఒత్తిడిలో ఉండి కూడా.. నా కోరికను మన్నించినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీరు మీ విలువైన సమయాన్ని 'జనసేన కవాతు పాటకి, యువతని ఆలోచింప చేసే పదాలు, భావితరాల భవిష్యత్తు కోసం పిరితనం వదిలి మనం మనోధైర్యంతో నడుం బిగించి ముందుకు నడవాలని అన్న మీ ఆలోచన స్పూర్తి చాలా ప్రస్పుటంగా పాట రచనలో కనిపించింది. మీకు మనస్పూర్తిగా, జనసేన తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను... అంటూ పవర్ స్టార్ ట్వీట్ చేశారు.

తమన్‌ను డియర్ బ్రదర్ అంటూ సంబోధిస్తూ... అతడి పని తీరును మెచ్చుున్నారు. కంపోజింగ్ అద్భుతంగా ఉందని, యువతలో మరింత ఉత్సాహాన్ని నింపేలా మీరు బాణీలు అందించారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











