twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కండోమ్ యాడ్స్... సంఘసేవ, ఆపేస్తే ఎలా? ప్రభుత్వ తీరుపై హాట్ బ్యూటీ ఫైర్

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ పాపులర్ స్టార్లైన బిపాసా బసు, సన్నీ లియోన్ తర్వాత... కండోమ్ యాడ్స్ చేస్తున్న భామ రాఖీ సావంత్. ఆమెను అభిమానించే వారు ఈ అడల్ట్ కమర్షియల్స్‌ తమ అభిమాన తారను చూడాలని ఆశపడుతున్నారు. అయితే ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల మధ్య ఈ యాడ్స్ ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. కండోమ్ యాడ్స్ ప్రదర్శనను ప్రైమ్ టైమ్‌లో నిషేధించడంపై రాఖీ సావంత్ ఫైర్ అయ్యారు.

     కండోమ్ యాడ్స్‌లో నటించడం సంఘసేవ

    కండోమ్ యాడ్స్‌లో నటించడం సంఘసేవ

    మన దేశంలో ఇంకా ఎక్కువగా కండోమ్ యాడ్స్ రావాల్సి ఉంది. అప్పుడే వాటి వాడకంపై ఎక్కువ చైతన్యం వస్తుంది. కండోమ్ ఎందుకు వాడాలి అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే కండోమ్ వాడకం అనేది ఎంతో ముఖ్యం. దీన్ని ఒక సంఘ సేవగా భావిస్తూ నేను ఈ యాడ్స్ లో నటిస్తున్నాను... అని రాఖీ సావంత్ తెలిపారు.

     ప్రభుత్వం భయపడుతోందా? ఎందుకింత రాద్దాంతం?

    ప్రభుత్వం భయపడుతోందా? ఎందుకింత రాద్దాంతం?

    బిసాపా బసు, సన్నీ లియోన్ లాంటి వారు కండోమ్ యాడ్స్ చేసినపుడు ప్రభుత్వం ఎలాంటి సెన్సార్ చేయలేదు. కానీ రాఖీ సావంత్ త్వరలో కండోమ్ యాడ్లో కనిపిస్తుంది అనగానే దాన్నో పెద్ద రాద్దాంతం చేసి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వాటిని టీవీల్లో ప్రదర్శించకుండా నిషేధం విధించారు. గవర్నమెంటు భయపడుతుందా? కండోమ్ యాడ్ ఇంకా చూడకుండానే ఎందుకు ఇలా చేస్తోంది? యాడ్ చూడకుండానే దానిపై ముసుగు వేయాలని చూస్తుందా?... అంటూ రాఖీ సావంత్ ఫైర్ అయ్యారు.

     అలా చేస్తే వారికి కండోమ్ వాడకం గురించి ఎలా తెలుస్తుంది?

    అలా చేస్తే వారికి కండోమ్ వాడకం గురించి ఎలా తెలుస్తుంది?

    కండోమ్ యాడ్స్ ప్రదర్శించడం ఆపివేస్తే... ఇండియాలో ప్రతి ఒక్కరు ఎయిడ్స్ బారిన పడతారు. పిల్లలు పడుకున్న సమయంలో కండోమ్ యాడ్స్ ప్రదర్శిస్తే కండోమ్ అంటే ఏమిటి? వాటి ఉపయోగం ఏమిటి? అనేది రేపటి పౌరులుగా మారబోయే వారికి ఎలా తెలుస్తుంది? ఆ యాడ్స్ టెలివిజన్ కు సూట్ అవ్వవు అని భావిస్తే వాటిని ఎడిట్ చేయడం, సెన్సార్ చేయడం లాంటివి చేయాలి... అంతే కానీ నిషేధం విధించడం వల్ల అనర్థాలే తప్ప ప్రయోజనం ఏమీ లేదు... అని రాఖీ సావంత్ అన్నారు.

    బిపాసా, సన్నీ లియోన్ వల్గర్ గా నటించారు

    బిపాసా, సన్నీ లియోన్ వల్గర్ గా నటించారు

    ప్రభుత్వం ఏదైనా నిబంధనలు తెస్తే అవి అర్థవంతంగా ఉండాలి. కానీ ఇలా బ్యాన్ విధించడం అనేది సరైంది కాదు. గతంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్, బాలీవుడ్ నటి బిపాసా బసు అతిగా స్కిన్ షో చేస్తూ వల్గర్‌గా నటించారు. నేను గవర్నమెంటును కోరేది ఒకటే. కండోమ్ యాడ్స్ ప్రదర్శనపై ఇలాంటి నిషేధం విధించవద్దు. స్కిన్ షో మీద, వల్గారిటీ మీద పరిమితులు పెట్టండి.... అని రాఖీ సావంత్ కోరారు.

     సెక్స్ గురించి మాట్లాడటం ఇపుడు కామన్

    సెక్స్ గురించి మాట్లాడటం ఇపుడు కామన్

    ఈ మధ్య కాలంలో టెలివిజన్లో ప్రసారం అయ్యే కార్యక్రమాలు, లైవ్ కామెడీ, చాట్ షోలలో సెక్స్ గురించి మాట్లాడటం అనేది కామన్ టాపిక్ అయిపోయిందని నా ఫీలింగ్. ప్రతి బాలీవుడ్ మూవీలో సెక్స్ కంటెంటును హైలెట్ చేసి చూపిస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. కానీ ఈ సారి మాత్రం వారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను... అని రాఖీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    వాటి గురించి మాట్లాడొద్దు అంటే ఎలా?

    వాటి గురించి మాట్లాడొద్దు అంటే ఎలా?

    ప్రతి రోజూ మనం సెక్స్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. చాలా మంది హెచ్ఐవి-ఎయిడ్స్ మీద ఫైట్ చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేస్తోంది. ఎయిడ్స్ డేను నిర్వహిస్తోంది. అలాంటపుడు కండోమ్ గురించి మాట్లాడొద్దు, ప్రైమ్ టైమ్ లో కండోమ్ యాట్స్ ప్రదర్శించవద్దు అంటే ఎలా? అంటూ రాఖీ సావంత్ ప్రశ్నించారు.

     ఇప్పటి పిల్లలు చాలా అడ్వాన్స్

    ఇప్పటి పిల్లలు చాలా అడ్వాన్స్

    ఇప్పటి తరం పిల్లలు చాలా అడ్వాన్డ్స్ గా ఉన్నారు. సెక్స్ అనే అంశాన్ని తెలుసుకోకూడని విషయంగా చూస్తే వారిలో దానిపై క్యూరిసిటీ మరింత పెరుగుతుంది. వారికి తెలియకుండానే సెక్స్ రిలేటెడ్ క్రైమ్ లో ఇరుక్కునే అవకాశం ఉంది. అందుకే వారికి సెక్స్ గురించి నాలెడ్జ్ అవసరమని నా అభిప్రాయం.... అని రాఖీ సావంత్ అన్నారు.

    ప్రధాని సపోర్టు చేస్తారని భావిస్తున్నాను

    ప్రధాని సపోర్టు చేస్తారని భావిస్తున్నాను

    నాకు ప్రభుత్వంతో ప్రతి సారి సమస్య ఎదురవుతోంది. నేను దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. గతంలో నేను సినిమా చేస్తున్న సమయంలో అభ్యంతరం పెట్టారు. ఇపుడు యాడ్స్ చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంలో నాకు ప్రధాన మంత్రి మద్దతు ఇస్తారని, కండోమ్ యాడ్స్ మీద ప్రైమ్ టైమ్ బ్యాన్ విషయంలో పునరాలోచిస్తారని భావిస్తున్నాను... అని రాఖీ సావంత్ అన్నారు.

    English summary
    After Bipasha Basu and Sunny Leone, Rakhi Sawant will be now seen endorsing a condom. While fans were eagerly waiting to see the diva in the adult commercials, the new rule banning condom ads between 6 am to 10 pm has disappointed many. And Rakhi being Rakhi openly lashed out at the recent ban.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X