Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇటు రామ్ చరణ్ తో..,అటు ధనుష్ తో...
హైదరాబాద్ :'బాద్షా' తరవాత కాజల్ మరో సినిమా ఒప్పుకోకపోవడంతో 'ఇక తెలుగు సినిమాలకు కాజల్ దూరమైపోతుంది' అనుకొన్నారంతా. అయితే కాజల్ మాత్రం గప్‌చుప్‌గా తన పని తాను చేసుకొంటోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన సినిమా ఓకే చేసిన ఆమె తమిళంలో వరుస అవకాశాలు అందిపుచ్చుకొంటోంది. యువ నటుడు ధనుష్, కలువకళ్ల భామ కాజల్ అగర్వాల్ తొలిసారిగా జంట కట్టనున్నారు.
తెలుగులో అగ్రస్థానంలో ఉన్న కాజల్ సమయం దొరికినప్పుడల్లా తమిళంలో నటిస్తోంది. కార్తీకి జంటగా 'నాన్‌మహాన్ అల్ల'తో హిట్టు అందుకున్న ఈ భామ... ఆపై సూర్యతో 'మాట్రాన్'లో నటించింది. మధ్యలో విజయ్‌తో 'తుపాకీ' రూపంలో బ్లాక్‌బస్టర్ అందుకుని పొంగల్ కానుకగా విడుదలైన 'జిల్లా'లోనూ కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కుర్ర హీరో ధనుష్‌తో తొలిసారిగా జంట చేరనుంది.
సిద్దార్థ హీరోగా 'కాదలిల్ సొదప్పువదు ఎప్పడి'ని తెరకెక్కించి క్లాసికల్ హిట్ అందుకున్న దర్శకుడు బాలాజీమోహన్... ధనుష్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. పలువురి పేర్ల పరిశీలన అనంతరం చివరకు కాజల్‌ను కథానాయికిగా ఎంపిక చేశారు. తెలుగుతోపాటు తమిళంలోనూ జోరు పెంచాలని భావించిన కాజల్ కూడా ధనుష్ సరసన నటించేందుకు వెంటనే అంగీకరించిందట. మిగతా నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి ఎక్కించే పనిలో ఉన్నాడట దర్శకుడు.
ఇక కాజల్ 2014 చివర్లో తెలుగులోనూ ఛాన్సులు సంపాదించింది. త్వరలోనే రామ్‌చరణ్‌తో జత కట్టనున్నట్టు సమాచారమ్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఆయన సినిమా అంటే కథానాయిక పాత్రకు ప్రాధాన్యం తప్పకుండా ఉంటుంది. పైగా 'మగధీర' కాంబినేషన్ అంటే తప్పకుండా ఆసక్తి పెరుగుతుంది.
ఈ సినిమాతో కాజల్ మళ్లీ ఫామ్‌ని అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇది కాకుండా మరో సినిమాపై కూడా కాజల్ సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. అంటే కాజల్ చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయన్నమాట. ఇవి కాకుండా తమిళ చిత్రాలూ చేస్తోంది.