జియా ఖాన్‌కు అబార్షన్ జరిగింది : పోలీసులు
హైదరాబాద్ : బాలీవుడ్ నటి జియా ఖాన్ జూన్ 3న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జియా మరణం తర్వత అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు క్రమక్రమంగా రుజువవుతోంది. తాజాగా పోలీసులు ఆమె సూరజ్ వల్ల గర్భం దాల్చిందని, అబార్షన్ కూడా జరిగిందని తేల్చారు.
పోలీసు అధికారులు ఓ ప్రముఖ పత్రికకు వెల్లడించిన వివరాల ప్రకారం..'ఈ సంవత్సరం మొదటి రెండు నెలల ప్రాంతంలో ఆమెకు అబార్షన్ జరిగిందని, ఇందుకోసం మాత్రలు వాడిందని తెలిపారు. డాక్టర్ స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసినట్లు వారు వెల్లడించారు'.
జియా ఖాన్ మరణం తర్వాత ఆమె రాసిన ఆరు పేజీల లేఖ బయట పడింది. దీన్ని ఆమె తల్లి రబియా పోలీసులకు అందించింది. అందులో జియా...బాయ్ ఫ్రెండుచే తను బలాత్కారం చేయబడ్డట్లుగా, టార్చర్ అనుభవించినట్లుగా పేర్కొంది. తనకు అబార్షన్ అయిన విషయాన్ని కూడా జియా ఈ లేఖలో బయట పెట్టింది.

జియా ఖాన్ తన బాయ్ ప్రెండు కారణంగా గర్భం దాల్చిందనే విషయంలో నిజం నిగ్గు తేలింది.

జియా ఖాన్ బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలి పోలీసుల వద్ద జియా గర్భం దాల్చిన విషయాన్ని, అబార్షన్ అయిన విషయాన్ని ఒప్పుకున్నాడు.

జియా రాసిన సూసైడ్ నోట్ ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత బయట పడింది. అందులో అనేక వాస్తవాలు వెల్లడయ్యాయి.

జియా ఖాన్ గర్భం దాల్చిన విషయం ఆమె సోదరికి కూడా తెలుసని సూరజ్ పోలీలసు విచారణలో వెల్లడించారు.

జియా ఖాన్‌కు తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నరకం చూపించాడు. ఆమె తన లేఖలో అతని మూలంగా టార్చర్ అనుభవించినట్లు తెలిపింది.

జియా ఖాన్ జూన్ 3న ఆత్మహత్య చేసుకుంది. జుహులోని తన అపార్టుమెంటులో ఉరివేసుకుంది.


Click it and Unblock the Notifications











