కెవి ఆనంద్‌తో రజనీ సినిమా ఖరారు, రూ. 100 కోట్లతో!
ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియాకు చెందిన ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ జైన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.....'కొచ్చాడయాన్, రాణా(పెండింగ్ ప్రాజెక్ట్) తర్వాత రజనీకాంత్‌తో మరో సినిమా చేయడానికి డీల్ కుదుర్చుకున్నాం. ఈ చిత్రానికి కె.వి.ఆనందర్ దర్శకత్వం వహిస్తారు. ఇతర వివరాలు ఫైనలైజ్ అయిన తర్వాత ప్రకటిస్తాం' అని తెలిపారు.
'మేము ఇప్పటికే హిందీ చిత్ర సీమలో లీడింగ్‌లో ఉన్నాం. తమిళ సినీ పరిశ్రమలో కూడా తమ సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనే ఉద్దేశ్యంలో ఉన్నాం. తమిళంలో సంవత్సరానికి కనీసం మూడు నాలుగు పెద్ద సినిమాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం' అని ఎకనామిక్స్ టైమ్స్ ఇంటర్వ్యూలో కమల్ జైన్ తెలిపారు. ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించే యోచనలో ఈరోస్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో కె.వి.ఆనంద్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసారు. తాజాగా రజనీకాంత్ చిత్రానికే దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో కెవి ఆనంద్ రంగం అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సూర్యతో బ్రదర్స్ చిత్రం తీసినా అది పెద్దగా విజయం సాధించలేదు.


Click it and Unblock the Notifications












