మహేష్ ఫ్యామిలీ సీక్రెట్ లీక్-ఇదిగో సాక్ష్యం!
మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది. మహేష్ బాబు మళ్లీ తండ్రి కాబోతున్నాడని, నమ్రత గర్భం దాల్చిందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. నమ్రత కూడా గర్భంతో ఎప్పుడూ బయట కనిపించలేదు.
ఇంతకాలం సీక్రెట్‌గా ఉన్న ఈ విషయం రామ్ చరణ్ పెళ్లి సందర్బంగా బయటకు లీకైంది. ఈ వేడుకకు భార్య నమ్రతతో కలిసి హాజరయ్యాడు మహేష్ బాబు. ఇక్కడ నమ్రత బేబీ బంప్‌తో కనిపించడంతో అందరి అనుమానాలు నివృత్తి అయినట్లయింది. నమ్రత సాధ్యమైనంత వరకు తన డ్రెస్‌తో బేబీ బంప్‌ను కవర్ చేసే ప్రయత్నం చేసింది.
మహేష్ బాబు మళ్లీ తండ్రి అవుతున్నాడనే విషయం స్పష్టం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మరి కొన్ని రోజుల్లోనే తీపి కబురు వినవచ్చని అంతా ఆశతో ఉన్నారు. ఇది తమకు మంచి శుభవార్తే అని, అయితే మహేష్ బాబు అఫీషియల్ గా ప్రకటించిన తర్వాతే సందడి మొదలు పెడతామని, అప్పటి వరకు కామ్ గానే ఉంటామని అంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగాల్సి ఉంది. అయితే అక్కడికి వెళ్లడం ఇష్టం లేని మహేష్ బాబు దిల్ రాజుపై ఫోర్స్ చేసి అందుకు సంబంధించిన సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించారని అంటున్నారు. గర్భతిగా ఉన్న భార్యకు తగ్గరగా ఉండాలనే కారణంతోనే మహేష్ బాబు ఈనిర్ణయం తీసుకున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











