పిబ్రవరిలో సినిమాల వర్షం...డిటేల్స్
సంక్రాంతి ముచ్చటగా మూడు సినిమాలతో ముందుకెళ్లిపోయింది. అందులోనూ బిజినెస్ మ్యాన్ సినిమాతో పోటి ఎందుకనుకున్న సినిమాలన్నీ పిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. దాంతో పిబ్రవరిలో సినిమాల వర్షం కురవనుంది. పిబ్రవరిలో విడుదల కానున్న చిత్రాల రిలీజ్ డేట్స్ వరసగా...
సునీల్ హీరోగా చేసిన పూలరంగడు పిబ్రవరి 3 న వస్తోంది. వీరభద్రమ్ దర్సకత్వంలో రూపొందిన ఈ కామిడీని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మించారు.రవితేజ నిప్పు కూడా పిబ్రవరి మొదటి వారంలోనే వస్తోంది. గుణశేఖర్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మరో దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మించారు.
పిబ్రవరి 9న ఎల్.వి.ప్రసాద్ సంస్ధ చాలా గ్యాప్ తర్వాత నిర్మించిన రుషి చిత్రం విడుదల అవుతోంది. మెడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణ అధినాయకుడు చిత్రం పిబ్రవరి 17 న వస్తోంది. పరుచూరి మురళి దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య మూడు పాత్రల్లో కనపించటం విశేషం.
వీటితో పాటు పిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు సిద్దార్ద తాజా చిత్రం లవ్ ఫెయిల్యూర్ విడుదల అవుతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు.
అమలా పౌల్ నటించిన నీ ఊహల్లో (డబ్బింగ్),ప్రకాష్ రాజ్ డైరక్ట్ చేసిన ధోని చిత్రాలు కూడా పిబ్రవరి మూడువ వారంలో రిలీజుకు రెడీ అవుతున్నాయి.
అంతేగాక వెన్నెల కిషోర్ వెన్నెల 1 1/2 ,బి.జయ తాజా చిత్రం లవ్ లీ, మంచు మనోజ్ ..మిస్టర్ నోకియా కూడా విడుదల తేదీలు కన్ఫర్మ్ కావాల్సి ఉన్నాయి. కానీ అవి కూడా పిబ్రవరిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వీటితో పాటు మరెన్నో చిన్న చిత్రాలు కూడా పిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











