లోకేశ్- జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్.. షర్టులు చినిగేలా.. పిడిగుద్దులతో వీరబాదుడు.. వీడియో వైరల్
ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉంది. ప్రతిపక్ష పార్టీలు ప్రచారం మరింత జోరుగా సాగిస్తున్నాయి. సభలు ఏర్పాటు చేసి ప్రజలతో మమేకం అవుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీలో వర్గ పోరు సాగుతోందని బయట ప్రచారం సాగుతోంది. మరి ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్... అనే వార్ కొనసాగుతోందంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రచార సభలు పెట్టినా కూడా అక్కడ ఇలాంటి రచ్చే కొనసాగుతోంది. కొంతమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ప్రదర్శించి. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అదే సయమంలో ఆ నినాదాలకు పోటీగా జై లోకేశ్ అంటూ మరికొంతమంది అభిమానులు నినాదాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడా వార్ అమెరికాకూ పాకిందని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే లోకేశ్ - ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఈ వార్ కాస్త శ్రుతిమించి.. కొట్లాటకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాళ్లకి వెళితే..

దేశం దాటింది... :ఈ మధ్యకాలంలో విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం వంటి చోట్ల.. టీడీపీ బహిరంగ సభల్లోనూ కొంతమంది నందమూరి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫోటోలూ ప్రదర్శిస్తూ... జై ఎన్టీఆర్ అని నినాదాలు చేసినట్లు కథనాలొచ్చాయి. అయితే ఇప్పుడది దేశం దాటింది.
పిడిగుద్దులు, షర్టులు చినిగేలా కొట్లాట.. :తాజాగా అమెరికాలోని ఫిలడెల్ఫీయాలో తానా సభలు జరుగుతున్నాయి. ఈ సభల్లో పాల్గొనేందుకు పలువురు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. అలాగే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో కొందరు జై ఎన్టీఆర్ అంటూ నినాదం చేశారు. దీనికి పోటీగా లోకేశ్ అభిమానులు కూడా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొట్లాట జరిగిందని తెలుస్తోంది. పరుచూరి - సతీశ్ వేమన అనే రెండు వర్గాలు కొట్టుకున్నాయట. షర్టులు చినేగేలా ఒకరి పై మరొకరు విరుచుకుపడ్డారట. పిడిగుద్దులు కూడా సంధించుకున్నారట. ఇదంతా టీడీపీ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ కోమటి జయరాం సమక్షంలో జరిగాయని తెలిసింది.
అప్పట్లో హరికృష్ణ విషంలో. .. :అయితే గత కొంతకాలంగా టీడీపీ లో ఇలాంటి గొడవలు జరగడం సాధారణమైపోయిందని అంటున్నారు. గతంలో కూడా ఇదే జరిగిందని గుర్తుచేసుకుంటున్నారు. అప్పుట్లో
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ విషయంలో ఇలాంటి తీరే జరిగిందని అంతా అంటున్నారు. ఏదేమైనప్పటికీ.. ఇలాంటి గొడవలు పునరావృతం కాకుండా ఉండాలని, అందరూ సహనంతో మెలగాలని ఇంకొంతమంది నందమూరీ అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











