బాక్స్ ఆఫీసు వద్ద తలపడనున్న నాగార్జున, గోపీచంద్
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాజన్న". విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మితస్తున్నారు. నాగ్ సరసన స్నేహా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రానికి ..'వెయ్యి వెయ్యి దెబ్బకి దెబ్బ" అనే పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా యంయం కీరవాణి సంగీతం అందించాడు.
ఈ దసరా కి తెలుగు సినిమాలు, అందులోను అగ్ర తారల సినిమాలు దండి గా విడుదల అవుతున్నాయి. అక్కినేని నాగార్జున నటిస్తున్న రాజన్న చిత్రం ముందు అనుకున్న తేది ప్రకారం సెప్టెంబర్ 30 న రావలసింది. అయితే సాంకేతిక పరంగా ఉనా కొన్ని ఇబ్బందుల వలన అక్టోబర్ 14 కి వాయిదా పడింది అయితే అదే రోజున గోపీచంద్ 'మొగుడు" కుడా విడుదల అవుతోంది. కృష్ణ వంశీ దర్సకత్వం లో రూపొందుతోన్న మొగుడు చిత్రం మీద కుడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈరెండు చిత్రాలు ఒకే రోజు తలపడుతుండడం తో కలెక్షన్లు దెబ్బ తింటాయ్ ఏమో అని భయపడుతున్నారు. ఈ పరిణామంతో లాభ పడేది మహేష్ బాబు దూకుడు మరియు ఎన్టీఆర్ ఊసరవెల్లి. రెండు చిత్రాలకు ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్ట దానికి తగిన సమయం ఉంది. ఏది ఏమైనా ఈ దసరాకి బాక్స్ ఆఫీసు మంచి ఎక్జైటీగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











