ప్రకటనలపై ఛానళ్లకు నోటీసులు

ఇదిలా ఉంటే...'అభయహస్తం' పేరిట పత్రికలలో జారీ చేసిన ప్రకటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సమాచార, ప్రజాసంబంధాల శాఖ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వివిధ పక్షాల ఫిర్యాదుపై తీసుకున్న చర్యలేంటో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్నీ ఆదేశించింది.
ప్రజాధనంతో అధికార పార్టీ ప్రతిష్ఠను పెంచే విధంగా ప్రకటనలు జారీచేయడాన్ని తప్పుపడుతూ అల్లాడి పి.రాజ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేశ్ దవె, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
రాజకీయ దురుద్దేశంతో ప్రకటనలు జారీచేస్తున్నారని, వివిధ పక్షాల నేతలు ఏడవ తేదీన ఇచ్చిన విజ్ఞాపనపై తీసుకున్న చర్యలు వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్ట్ ఆదేశించింది. విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications











