'జయహో' రైట్స్ కాంగ్రెస్ వే

అంతర్జాతీయంగా పాపులర్ అయి సినీ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న 'స్లమ్ డాగ్ మిలీయనీర్' చిత్రం కోసం రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను రైట్స్ తీసుకోవటంపై కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి కూటములపై శక్తివంతమైన ప్రచారాయుధంగా సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా స్లమ్ డాగ్ విజయాన్ని తమ విజయంగా మార్చుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చక్‌దే పాటను తమ ప్రచారగీతంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











