twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జయహో' రైట్స్ కాంగ్రెస్‌ వే

    By Staff
    |

    AR Rahman
    మనదేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన జయహో గీతం రైట్స్ ని కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు టీసీరీస్‌ సంస్థ నుంచి హక్కులు కూడా పొందినట్లు ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మీడియాకు తెలిపారు. దాంతో బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా హోరెత్తిపోతున్న 'జయ హో' గీతం ఇకపై కాంగ్రెస్‌ శిబిరంలో విజయ గీతమై పల్లవించనుంది. తమ పాలన సామాన్యుడికోసం జరిగిందని వారు ఈ గీతం ద్వారా చెప్పనున్నారు.

    అంతర్జాతీయంగా పాపులర్ అయి సినీ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న 'స్లమ్‌ డాగ్‌ మిలీయనీర్‌' చిత్రం కోసం రెహమాన్‌ స్వరపరిచిన ఈ పాటను రైట్స్ తీసుకోవటంపై కాంగ్రెస్‌ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి కూటములపై శక్తివంతమైన ప్రచారాయుధంగా సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా స్లమ్ డాగ్ విజయాన్ని తమ విజయంగా మార్చుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ ముమ్మరం చేసింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ చక్‌దే పాటను తమ ప్రచారగీతంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X