హైదరాబాద్: పోసాని కృష్ణమురళి నిర్మిస్తున్న 'రాజా గారి చెరువులో చేపలు' చిత్రంపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న పోసాని... కాంగ్రెస్‌ను దెబ్బతీసెలా ఈ చిత్రం రూపొందిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ చిత్రం పేరు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా ఉందని...కాంగ్రెస్ ఎంపీ ఎం.ఎ.ఖాన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం కల్గించేలా ఉన్న ఈ సినిమా సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకుండా ఆపాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది.