మహేష్ తో కలసి జయసుధ 'చెయ్యి'?

అయితే కాంగ్రేస్ పార్టీకి మాత్రం ఈ సినీ మెరుపులు కానరావటంలేదు. ఆ లోటును మహేష్ భర్తీ చేస్తారని భావించినా .. అది కాస్తా అందని ద్రాక్షగా మారింది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జీవిత రాజశేఖర్ దంపతులు గాంధీ భవన్‌వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మరో నటి జయసుధ కూడా పార్టీలో క్రియాశీలకపాత్రను చేపట్టిన దాఖలాలు కన్పించడం లేదు. యువతలో కాంగ్రెస్ భావాలు పెంచుతానని, ప్రభుత్వ పథకాలు వివరిస్తానని జయసుధ ప్రకటించారు.
కాని.. ఇప్పటి వరకూ కార్యాచరణ ప్రారంభించలేదు. హీరో నాగార్జున ప్రభుత్వ పథకాల ప్రచారాల్లో కన్పిస్తున్నా.. ప్రత్యక్షంగా ప్రచారం చేసే అవకాశాలు కన్పించడం లేదు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సినీతారలు కొందరికి ప్రభుత్వం తరఫున నజరానాలు భారీగానే దక్కినా .. అందుకు తగిన ప్రతిఫలం పార్టీకి దక్కలేదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏదైమైనా సినిమావాళ్ళు ఇలా హ్యాండిస్తారనేది మింగుడుపడని అంశంగా పార్టీ వర్గాల్లో మిగులుతోంది.


Click it and Unblock the Notifications











