బాలయ్య తొడ కొట్టుడుపై..

తొడ చప్పుళ్లకు, మీసం తిప్పడాలకు బెదిరిపోయేవారు, మురిసిపోయేవారు ఎవరూ లేరన్న వాస్తవాన్ని బాలకృష్ణ గ్రహిస్తే మంచిదని ఆయన సూచించారు. రొయ్యకు కూడా మీసాలుంటాయని, తన కంటె పొడవైన మీసాలుంటాయని గ్రహిస్తే మంచిదని, మహాభారతంలో తొడగొట్టిన దుర్యోధనుడి తొడలను భీమసేనుడునుజ్జునుజ్జు చేసిన సన్నివేశాన్ని బాలకృష్ణ గుర్తు తెచ్చుకుని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇక శ్రీహరి ప్రజా సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలుతో పాటు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్దానంలో నిలిపిన కాంగ్రెస్ ను మరోసారి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తాను సమాజానికి ఉపయోగపడే అనేక సినిమాలలో నటించానని, అయితే వైఎస్ఆర్ ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషిని చూసి ఆకర్షితుడినై కాంగ్రెస్ లో చేరానన్నారు. తులసిరెడ్డి అయితే బాలయ్య ఇలా అస్తమాటూ మీసం మెలేస్తే ఊడిపోతుందని హెచ్చరించారు. బాలకృష్ణ రోడ్ షోలలో తరచూ మీసం మెలేయడం, తొడగొట్టడం శోచనీయమని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











