కాంగ్రెస్ కే చిరు తొలి దెబ్బ!!
చిరంజీవి ఇంకా పార్టీ పెట్టనేలేదు కానీ ఎఫెక్ట్ మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు తామున్న పార్టీలకు రాజీనామాలు చేయడం మొదలెట్టారు. ఈ వరుసలో ముందున్నది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) కార్యదర్శి బోండా శ్రీనివాసరావు ఉన్నారు. ఈయన గురువారంనాడు విజయవాడలో తన పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. డీజీపీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రనాడు పార్టీని స్థాపించిన ఎంవి భాస్కరరావు కూడా చిరంజీవి పార్టీలో చేరడానికి ఉత్సుకతతో ఉన్నాడు. చిరంజీవి పార్టీ పెట్టడం ఖాయం, తాను అందులో చేరతాను అని ఆయన బుధవారమే ప్రకటించారు. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఈ వరుసలో ఉన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మాజీ టిడిపి ఎమ్మెల్యే చిరంజీవి పార్టీ పెడితే అందులో చేరతానని చెప్పారు.


Click it and Unblock the Notifications











