నేను ఎప్పటికీ నీ దాన్నే.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వాట్సాప్ చాట్ లీక్ చేసిన మాఫియా డాన్
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి గత కొంత కాలంగా వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధించిన వాట్సాప్ చాట్ ను లీక్ చేశాడు. అందులో ఆమె చూపించిన ప్రేమ గురించి వివరించాడు. అలాగే ఆమె తన చేతులతో రాసిన కార్డు స్క్రీన్ షాట్ ను బయట పెట్టాడు. అదేంటో మనం ఇప్పుడు తెలుసకుందాం.
మీరు ఇప్పుడు చూస్తున్న చాట్ 2021కి సంబంధించింది అని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ కు నాకు మధ్య గొడవ వచ్చింది.. కానీ తాను అవేవీ పట్టించుకోకుండా ఆమె నాకు క్షమాపణలు చెప్పడం మీరు ఇందులో చూడవచ్చు అంటూ సుకేష్ వెల్లడించాడు. అయితే సుకేష్ షేర్ చేసిన ఆ స్క్రీన్ షాట్ లో.. నేను ఎప్పిటకీ మీ దాన్నే.. లవ్ బుట్టబొమ్మ అంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రాసిన కార్డును ఉంది. అయితే ఇది కేవలం "టీజర్" మాత్రమేనని, తన వద్ద వందలాది చాట్‌లు , వాయిస్ రికార్డింగ్‌లు, వీడియో చాట్‌లు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వాటిని ఇస్తానని పేర్కొన్నారు.

అలాగే చివర్లో మీరు నాకు వేరే మార్గం లేకుండా చేసి వదిలేశారు.. అంటూ ఆర్థిక నేరగాడు సుకేష్ చెప్పుకొచ్చాడు. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నటుడు అనేక వాస్తవాలను అటకెక్కించారని సుకేష్ వెల్లడించాడు. కానీ తాను వాటిన్నిటినీ వెలుగులోకి తెస్తానని.. తన వద్ద ఉన్న ఆధారాలతో అదంతా సాధ్యం అవుతుందని వివరించాడు. అంతేకాకుండా తనకు, జాక్వెలిన్ కు సంబంధించిన వాట్సాప్ చాట్ ను ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచానని.. నేను కాపాడాలనుకున్న వ్యక్తే నన్ను తప్పు పట్టడం చూసి వెలుగులోకి తెస్తున్నానని వివరించారు.

మీకు ఏమైనా అనుమానాలు ఉంటే జాక్వెలిన్ చేతి రాతను కూడా పోల్చి చూడవచ్చని.. దానితోనే మీకు అసలు నిజాలు తెలుస్తాయని స్పష్టం చేశాడు. సుకేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు చాలా కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కేసులో నటి జాక్వెలిన్ ను కూడా నిందితురాలిగా పేర్కొంది. అలాగే ఈ కేసులో భాగంగానే విచారించగా... జాక్వెలిన్.. సుకేష్ తన జీవితాన్ని నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. అలాగే తనకు జీవనోపాధిని కూడా పాడు చేశాడని న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి.


Click it and Unblock the Notifications











