బీచ్‌లో బట్టలు విప్పేస్తానని శ్రీరెడ్డి ఆఫర్.. జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు అలా!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అంటే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంటాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఎన్నో అంచనాలు, ఊహాగానాల నడుమ సాగిన ఈ సమరంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి విజయం సాధించింది. తద్వారా గత అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఫలితాలపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. అంతేకాదు, బట్టలు విప్పుతానన్న చాలెంజ్‌పైన కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే....

అత్యధిక సీట్లు కూటమివే:కొద్ది రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి విజయం సాధించింది. ఆరంభం నుంచీ హవాను చూపించిన కూటమి 175 స్థానాలకు గానూ ఏకంగా 164 నియోజకవర్గాల్లో గెలిచింది. తద్వారా ఈ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Controversial Actress Sri Reddy Gives Clarity On Election Challenge

వైఎస్ జగన్ రాజీనామా:2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. ఈ పార్టీ నుంచి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అధికారాన్ని కోల్పోవడంతో వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ప్రజల తరపున పోరాటం చేయడానికి తాము ఎప్పుడూ ముందరే ఉంటామని చెప్పారు.

శ్రీరెడ్డి వరుస పోస్టులతో:ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఆధిపత్యాన్ని చూపించి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి ఒకవైపు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మాత్రం అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి మద్దతుదారులు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీరెడ్డి వరుసగా పోస్టులు చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటోంది.

Controversial Actress Sri Reddy Gives Clarity On Election Challenge

బాధపడకు జగన్ అన్న:తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో 'బాధపడకు జగన్ అన్న.. క్యాడర్‌కు కొత్త ఊపిరి పోయాలి. నిలబడు, పోరాడు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ అందరి కోసం బలం తెచ్చుకో. ఇక రోజూ ఒక పోరాటమే. విజయం ఉన్న వాళ్ళ వైపు జారబడే వాళ్ళు ఎక్కువ. వెక్కిరించే వెదవలు కోసం కాదు.. నీ సైన్యం కోసం పోరాడాలి' అంటూ మాజీ ముఖ్యమంత్రికి సపోర్టుగా పోస్టు చేసింది.

బీచ్‌లో బట్టలు విప్పేసి:ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శ్రీరెడ్డి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె 'జగనన్న ఈ ఎన్నికల్లో గెలవకపోతే వైజాగ్ బీచ్‌లో బట్టలు విప్పేసి తిరుగుతా' అని ఉంది. దీంతో నిజంగానే ఆమెను 'బట్టలు విప్పేసి తిరగాలి' అంటూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. దీంతో శ్రీరెడ్డి పేరు మరోసారి హాట్ టాపిక్ అయిపోతోంది.

Controversial Actress Sri Reddy Gives Clarity On Election Challenge

క్లారిటీ ఇచ్చేసిన శ్రీరెడ్డి:జగన్ ఓడిపోతే బట్టలు విప్పేసి తిరుగుతా అని చాలెంజ్ చేసినట్లు వస్తున్న వార్తలపై తాజాగా శ్రీరెడ్డి స్పందించింది. ఈ మేరకు ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు రిప్లై ఇస్తూ.. 'తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్పుతో కొడతా. బట్టలు విప్పేసి తిరుగుతా అని నేనెప్పుడు అన్నానురా. ల****లారా' అంటూ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఈ అంశంపై పలుమార్లు స్పందిస్తూ పోస్టులు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X