Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెచ్చగొట్టేలా చాటింగ్.. పోలీసులకు దొరికిపోయిన ప్రముఖ నటుడు.. మూడవసారి అరెస్ట్!
సినిమా.ప్రపంచంలో సెలబ్రెటీ హోదా అనేది ఒక బాధ్యతతో కూడుకున్నది అని చాలా మంది సెలబ్రెటీలు ఆలోచించి అడుగులు వేస్తుంటారు. మాట్లాడే మాట, వేసే అడుగు కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే రోజులివి. ఏమి చేయని వాళ్ళకే కొన్నిసార్లు నిందలు తప్పడం లేదు. ఇక ఏదైనా తప్పులో దొరికితే ఎక్కడా కనిపించినా ఎదో ఒక కామెంట్ చేయకుండా ఉండరు.
పోలీసుల అదుపులో నటుడు..
రీసెంట్ గా ఒక ప్రముఖ నటుడు కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేసిన సమస్యల్లో ఇరుక్కున్నాడు. బాలీవుడ్ కి చెందిన ఎజాజ్ ఖాన్ అనే నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు హిందీ బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళాడు అజాజ్. ఇక తెలుగులో కూడా కొన్ని పెద్ద సినిమాల్లో నటించాడు. దూకుడు, నాయక్, టెంపర్ వంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రల్లో కనిలించిన విషయం తెలిసిందే.
ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా?
ఎజాజ్ ఖాన్ ఇటీవల తన ఫాలోవర్స్ తో సోషల్ మీడియాలో లైవ్ లో చాట్ చేశాడు. అయితే కొందరిని రెచ్చగొట్టేలా మధ్యలో ఎజాజ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో వెంటనే అతన్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనవసరంగా ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా ఎజాజ్ ఖాన్ నెగిటివ్ కామెంట్స్ చేయడంతో అతనిపై కేసు కూడా నమోదు చేశారు.
గొడవలు కొత్తేమి కాదు..
ఎజాజ్ ఖాన్ కి ఇండస్ట్రీలో మంచి నటుడిని ఒక నేమ్ తెచ్చుకుంటున్న సమయంలో సంబంధం లేని గొడవలలో ఇరుక్కోవడం స్టార్ట్ చేశాడు. దీంతో అతనికి అవకాశాలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. ఇక పలుసార్లు బహిరంగంగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ పోలీసుల చేతికి చిక్కారు. అయినప్పటికీ ఎజాజ్ లో ఎలాంటి మార్పు రాలేదు.
Recommended Video
లైంగిక వేధింపులు..
ఎజాజ్ ఖాన్‌పై ఇంకా పలు రకాల కేసులు ఇదివరకే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మాధకద్రవ్యాల కలిగిన కేసులో పట్టుబడడమే కాకుండా 2016లో ఒక బ్యూటీషియన్ని లైంగికంగా వేదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు అరెస్టయినా మారలేదు. మళ్ళీ చాలా కాలం తరువాత అజాజ్ జనాల్లో విద్వేషపూరిత ఆలోచనలు కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు.