»   »  ప్రేమలో శ్వేతబసు...బోయ్ ఫ్రెండ్ తో ఇలా (లీక్ ఫొటోలు)

ప్రేమలో శ్వేతబసు...బోయ్ ఫ్రెండ్ తో ఇలా (లీక్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ మధ్యన సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న శ్వేతాబసు ప్రసాద్ తర్వాత సినిమాలు అయితే ఏమీ పట్టుకోలకపోయినా , ప్రేమ వ్యవహారం మాత్రం నడిపిస్తోందని చెప్తున్నారు. బాలీవుడ్ లో ఓ యువ దర్శకుడుతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే వార్త మాత్రం ప్రచారంలోకి వచ్చింది.

రోహిత్ మిట్టల్‌ అనే వ్యక్తితో శ్వేతాబసు డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కార్యాలయంలో శ్వేతాబసు స్క్రిప్ట్ కన్స ల్టెంట్‌గా పని చేస్తున్నారట.అక్కడే రోహిత్‌తో శ్వేతకు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్తా ఇప్పుడు డేటింగ్‌కు దారి తీసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

శ్వేత, రోహిత్ సన్ని హితంగా ఉన్న ఫొటోలు చూస్తుంటే డేటింగ్‌లో ఉన్నారనే వార్త నిజమనే అంటున్నారు. మొత్తానికి శ్వేత కొత్త బంగారు లోకంలో విహరిస్తోంది అంటున్నారు.

ముంబైలో ఉంటున్న స్వేతాబసు ప్రస్తుతం ప్రొడక్షన్ హౌజ్‌లో స్క్రిప్ట్ కన్సల్టంట్‌గా పనిచేస్తుంది. అదేవిధంగా పలు డాక్యుమెంటరీలను రూపొందిస్తుంది. టీవీ రంగం ఆమెకు మరోమారు రెడ్ కార్పెట్ వేస్తోంది. దార్ సబ్ కో లగ్‌తా హై అనే హారర్ టీవీ సిరీస్‌లో లీడ్ రోల్ పోషించబోతుంది. ఏ రంగమైతేనేం అమ్మడు కళాక్షేత్రంలోనూ, ప్రేమ క్షేత్రంలోనూ మళ్లీ బీజీ అవనుంది.

ఆ వివరాలు, బోయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోలు ఇక్కడ మీరు చూడవచ్చు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా...

చైల్డ్ ఆర్టిస్ట్ గా...

బహుముఖ ప్రజ్ఞాశాలియైన శ్వేతాబసు ప్రసాద్ 11 ఏళ్ల ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ప్రవేశించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డును గెలుచుకుంది.

టీవీ సీరియల్స్ లోనూ..

టీవీ సీరియల్స్ లోనూ..

కుతుంబ్, కహానీ ఘర్ ఘర్ కరీష్మా కా కరీష్మా, ది మ్యాజిక్ మేకప్ బాక్స్ వంటి హిందీ సీరియళ్లలో లీడ్‌రోల్స్‌లో నటించి విశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది.

లీడ్ రోల్స్

లీడ్ రోల్స్

అనంతరం కాలంలో నటిగా బెంగాళీ, తెలుగు, తమిళ సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటించింది.

తెలుగులో

తెలుగులో

శ్వేతాబసు తెలుగు డెబ్యూగా వచ్చిన కొత్త బంగారులోకం మూవీ మంచి కమర్షియల్ విజయాన్ని సాధించింది.

తెలుగులో వరసగా...

తెలుగులో వరసగా...

తదనంతరం కాస్కో, కలావర్ కింగ్, ప్రియుడు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా వంటి పలు చిత్రాల్లో నటించింది.

వ్యభిచారం కేసులో

వ్యభిచారం కేసులో

ఆగస్టు 2014లో వ్యభిచారం ఆరోపణలపై శ్వేతాబసు హైదరాబాద్‌లో అరెస్టు అయింది.

క్లీన్ చిట్

క్లీన్ చిట్

పలు విచారణల అనంతరం డిసెంబర్ 2014లో నాంపల్లి కోర్టు ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది.

కొట్టివేసింది

కొట్టివేసింది

పోలీసులు ఆమెపై ఆరోపించిన సెక్షన్లంటినీ కొట్టివేసింది.

స్పందిస్తూ...

స్పందిస్తూ...

దీనిపై శ్వేతబసు స్పందిస్తూ అసత్య ఆరోపణలు చేసిన మీడియాపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది.

ఖండించాలన్నారు కానీ..

ఖండించాలన్నారు కానీ..

సహనటిపై జరిగిన నిరాధార ఆరోపణలను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. కష్టకాలంలో అండగా ఉంటామన్నారు.తిరిగి తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారు. ఇదంతా ప్రచారానికే అని తేలిపోయింది.

టీవికే...

టీవికే...

ఊరించి ఊసురుమనిపించడంతో తనకు పేరుతెచ్చిపెట్టిన టెలివిజన్ రంగాన్నే నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి నమ్ముకుంది.

 అప్పట్లో ...శ్వేతాబసు మాట్లాడుతూ...

అప్పట్లో ...శ్వేతాబసు మాట్లాడుతూ...

నేను కష్టడీలో ఉన్నాను. రెస్కూ హోమ్ లో కనీసం నా తల్లి,తండ్రి ఎవరితోనూ మాట్లాడనివ్వరు. అలాంటి పరిస్ధితుల్లో మీడియాతో ఎలా మాట్లాడతాను. తమకు తోచిన కథనాలు అల్లితే ఎలా. నా సినీ కెరీర్ ముగినట్లే అంటూ నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు ప్రచురించారు.

నా కుటుంబం గురించి తెలుసా

నా కుటుంబం గురించి తెలుసా

శ్వేత కోపంతో తన కుటుంబ నేపధ్యం గురించి వారికేమైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. అరెస్టు సమయంలో కొన్ని కొన్ని సినీ ఆఫర్లు కూడా నా చేతిలో ఉన్నాయి. సినీ పరిశ్రమతో మంచి సంభంధాలు ఉన్నాయని, ఎంతో మంది స్నేహితులు తనకు ఉన్నాయని, వారంతో ష్టం సమయంలో వెన్నంటి ఉన్నారని తెలిపింది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

నేను ఓ అవార్డు ఫంక్షన్ కోసం అక్కడకి వెళ్ళాను. ఆ కార్యక్రమ నిర్వాహకులు నాకు టిక్కెట్లు, హోటల్ గదిని కేటాయించారు. ఇప్పటికీ నా దగ్గర టిక్కెట్లు ఉన్నాయి. కానీ దురదృష్టం వెంటాడింది. ఆ సమయంలో పోలీస్ లు దాడి చేసారు. ఓ ఏజెంట్ ని అరెస్టు చేసామని, కేసుని విచారిస్తున్నామని నాకు తెలిపారు. కానీ ఆ కేసులో భాధితురాలిగా మారాను. అసలు విషయాలు బయిటకు రాకుండా చేసారు.

పోలీసులు ఏం అడిగారంటే..

పోలీసులు ఏం అడిగారంటే..

వ్యభిచారానికి పాల్పడిన టాలీవుడ్ స్టార్స్ పేర్లు చెప్పమంటూ పోలీసులు అడిగారు. అయితే నేనెందుకు ఇతరులపై కామెంట్ చేయాలి అన్నారామె.

రెస్కూ హోం లో

రెస్కూ హోం లో

నాతో పాటు అక్కడ అక్రమ మానవ రవాణాలో పట్టుబడిన పిల్లలు ఉన్నారు. వాళ్లకు టీచర్ సేవలందించారు. పిల్లలకు హిందీ, ఇంగ్లీష్, హిందూస్ధానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించాను. ఆ రెండు నెలల కాలాన్ని చక్కగా వినియోగించుకున్నాను.

జర్నలిస్టే చేసారు

జర్నలిస్టే చేసారు


జరిగిన వ్యవహారంలో నాకు ఎవరిమీదా కంప్లైంట్ లు లేవు. కాకపోతే నేను ఏమీ మాట్లాడకుండానే ఆ సంక్షోభ సమయంలో అన్ని దారులూ మూసుకుపోవటం వల్లే ఈ పనికి పాల్పడ్డా. డబ్బు సంపాదించడం కోసం వ్యభిచారంలోకి దిగాల్సిందిగా కొందరు నన్ను ప్రోత్సహించారు అంటూ నా పేరు మీద ఓ జర్నలిస్టు తప్పుడు ప్రకటన జారీ చేసారు. రెండు నెలలు పత్రికలు నాకు అందుబాటులో లేవు. దాని గురించి ఇప్పుడే తెలిసింది.

శాడిజం

శాడిజం

ఎవరైనా కష్టాల పాలై ఇబ్బందులు పడుతూంటే అది చూసి ఆనందించటం మన మానవ జాతి లక్షణం. మనం శాడిష్టులం. నా పేరు మీద తప్పుడు ప్రకటన ప్రచారంలో పెట్టిన ఆ జర్నలిస్టును ఈ విషయమై నిలదీసి అడుగదలుచుకున్నా.

అండగా నిలిచింది

అండగా నిలిచింది

నాకు ఎక్కువ భాగం మీడియా అండగా నిలిచిన విషయం వాస్తవమే. అందుకే తిరిగి ఇంటికి రాగలిగాను. జరిగిందేమిటన్న విషయమై లోతుల్లోకి వెళ్లదలుచుకోలదు. అది కోర్టులో ఉన్న విషయం

చర్యలు తీసుకుంటాను

చర్యలు తీసుకుంటాను

నాపై అవాస్తవాలన్ని ప్రచరించిన జర్నలిస్టు ను, న్యూస్ పేపరు గురించి వివరాలు సేకరిస్తున్నా. అందుకు భాధ్యులైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని ఆమె అన్నారు.

English summary
Shweta Basu Prasad has been dating an upcoming filmmaker Rohit Mittal since February this year. Rohit has directed a shortie titled Autohead. The two met at Kashyap’s office and sparks flew immediately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu